Bakrid Cow Slaughter PIL | గోవధ నిషేధ పిటిషనర్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు!

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్Bakrid Cow Slaughter PIL | బక్రీద్ పండుగను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా గోవధ నిషేధ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన కోర్టు కేసు(PIL) విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పండుగకు కేవలం రెండు రోజుల ముందే ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలంటూ కోరడంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

Bakrid Cow Slaughter PIL | కఠినంగా అమలు చేసేలా..

భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జైమాల్య బాగ్చీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు పిటిషనర్ తరపు న్యాయవాది వరుణ్ కుమార్ సిన్హా ఈ అంశాన్ని ప్రస్తావించారు. “ఎల్లుండి బక్రీద్ పండుగ ఉన్నందున, గోవధ నిరోధక చట్టాన్ని కఠినంగా అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలి. ఈ పిటిషన్‌ను రేపటి విచారణ జాబితాలో చేర్చాలి” అని లాయర్ కోరారు. దీనిపై స్పందించిన సీజేఐ ధర్మాసనం ఘాటుగా స్పందించింది. “సంవత్సరమంతా ఊరుకుని, పండుగకు సరిగ్గా ఒక్క రోజు ముందే మీకు ఈ విషయం గుర్తుకొచ్చిందా? ఇందులో ఎలాంటి అత్యవసర పరిస్థితి కనిపించడం లేదు. ధన్యవాదాలు” అని పేర్కొంటూ అత్యవసర విచారణ అభ్యర్థనను తోసిపుచ్చింది.

bakrid

Bakrid Cow Slaughter PIL | పిటిషన్‌లోని ప్రధాన డిమాండ్లు..

అఖిల భారత హిందూ మహాసభ మాజీ ఉపాధ్యక్షుడు సతీష్ కుమార్ అగర్వాల్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. దేశంలో ఆవులు, వాటి సంతతిని వధించకుండా రక్షించేందుకు ప్రస్తుతమున్న చట్టాలను మరింత కఠినంగా అమలు చేయాలని ఆయన కోరారు. అంతేకాకుండా, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో చట్ట నిబంధనల ప్రకారం కబేళాలను (Slaughterhouses) నియంత్రించేలా మార్గదర్శకాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాల్సిందిగా పిటిషనర్ కోర్టును అభ్యర్థించారు. అయితే, పండుగ తరుణంలో ఇటువంటి తక్షణ ఆదేశాలు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు మొగ్గు చూపలేదు.

ఇది కూడా చదవండి: Mudiraj BC-A Demand | ముదిరాజ్‌లను బీసీ-ఏ జాబితాలోకి చేర్చాలి: ఈటల రాజేందర్

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *