అక్షరటుడే వెబ్‌డెస్క: Mamata | పశ్చిమ బెంగాల్, కేరళ Kerala రాష్ట్రాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు దేశ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకున్న చర్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపాయి.
Mamata | కౌంటింగ్‌కు ముందే..
ఫలితాలు రాకముందే మమతా బెనర్జీ Mamata Banerjee తన అధికారిక సీఎం నివాసాన్ని ఖాళీ చేసినట్లు సమాచారం. ఈ చర్య అనూహ్యంగా మారడంతో, ఆమె రాజకీయ వ్యూహంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు, పినరయి విజయన్ తన ‘ఎక్స్’ (మునుపటి ట్విట్టర్) ప్రొఫైల్‌లో ముఖ్యమంత్రి హోదాను తొలగించి, “పొలిట్ బ్యూరో సభ్యుడు, సీపీఐ(ఎం)”గా మార్చడం ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఈ పరిణామాలు రెండు రాష్ట్రాల్లో రాజకీయ ఉత్కంఠను పెంచుతున్నాయి. ముఖ్యంగా ఎన్నికల కౌంటింగ్‌కు కొద్దిసేపటి ముందు ఈ చర్యలు చోటుచేసుకోవడం వల్ల, ఫలితాలపై ముందస్తు అంచనాలు ఉన్నాయా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఓటమిని పసిగట్టారా..?
సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ అంశంపై విస్తృతంగా చర్చిస్తున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఓటమిని ముందుగానే పసిగట్టారా..? లేక ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్న ఫలితాల ఆధారంగా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకున్నారా..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
అయితే, ఈ చర్యలపై ఇరువురు నేతల నుంచి అధికారికంగా ఎలాంటి స్పష్టత రాలేదు. ఫలితాలు వెలువడిన తర్వాతే ఈ పరిణామాల వెనుక అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Kavitha New Party | కేసీఆర్, కవితల మధ్య విభేదాలపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

