Adluri Challenge | హరీష్ రావుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ బహిరంగ సవాల్

గురుకులాల్లో కిరాణ టెండర్లలో రూ. 2 వేల కోట్ల స్కాం జరిగిందన్న మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపణలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Adluri Challenge |గురుకులాల్లో కిరాణ టెండర్లలో రూ. 2 వేల కోట్ల స్కాం జరిగిందన్న మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపణలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ( Adluri Laxman Kumar ) కుమార్ తీవ్రంగా ఖండించారు. తన శాఖలో అవినీతి జరగలేదని స్పష్టం చేసిన ఆయన, హరీష్ రావు ఆరోపణలను ఆధారాలతో నిరూపించాలని బహిరంగ సవాల్ విసిరారు.

Adluri Challenge | పదవికి రాజీనామా చేస్తా..

“నా శాఖలో రూ. 2 వేల కోట్ల అవినీతి జరిగిందని హరీష్ రావు అంటున్నారు. ఆయన చెప్పిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, నేను వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేస్తాను. ప్లేస్ (స్థలం) కూడా మీరే నిర్ణయించండి. నేను, నా శాఖకు చెందిన అధికారులందరితో కలిసి అక్కడికి వస్తాను. అన్ని ఆధారాలను మీ ముందు ఉంచుతాను” అని మంత్రి సవాల్ చేశారు.

Adluri Challenge  | రాజకీయాల నుంచి తప్పుకుంటారా?

ఒకవేళ ఆరోపణలు నిరూపించలేకపోతే, హరీష్ రావు తన రాజకీయ జీవితం నుంచి తప్పుకుంటారా అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు అబద్ధపు ఆరోపణలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఇలాంటి ఆరోపణలు చేయడం మానుకోవాలని, ఏదైనా ఉంటే ఆధారాలతో సహా బయటపెట్టాలని ఆయన కోరారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేసిన ఈ సవాల్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హరీష్ రావు దీనిపై ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇది కూడా చదవండి:  Women Child Safety | మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యతనివ్వాలి: అదనపు డీసీపీ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *