Ganesh Utsav Celebrations | భక్తి భావంతో ఉత్సవాలు నిర్వహించాలి : ఎమ్మెల్యే ధన్​పాల్​

వినాయక ఉత్సవాలను భక్తి భావంతో నిర్వహించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ సూచించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Ganesh Utsav Celebrations | వినాయక ఉత్సవాలను భక్తి భావంతో నిర్వహించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ తెలిపారు. ధన్​పాల్ లక్ష్మీ బాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్​ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని మార్వాడీ గల్లీలో ఉన్న కార్యాలయంలో వినాయక ఉత్సవ నిర్వాహకులకు చందాలు రాశారు.

Ganesh Utsav Celebrations | భక్తిమార్గంలో నడవాలి

ఎమ్మెల్యే (MLA Dhanpal) మాట్లాడుతూ.. ఇందూరు యువత భక్తి మార్గంలో నడవాలని సూచించారు. వినాయక ఉత్సవాలను హిందూ సాంప్రదాయం ప్రకారం ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా శాంతియుతంగా నిర్వహించాలని సూచించారు. ప్రతి ఏడాది తమ ట్రస్టు ద్వారా సహకారం అందిస్తామని గత సంవత్సరం 725 మండపాలకు అందించినట్లు పేర్కొన్నారు. భగవంతుడి ఆశీర్వాదంతో ఈ ఏడాది కూడా వచ్చిన వారందరికీ తన వంతు సహకారం ఉంటుందన్నారు. వినాయకుడు కేవలం ఒక పండుగకు సంబంధించిన దేవుడు కాదని సంస్కృతి సనాతన ధర్మం ఐక్యతకు ప్రతీక అని చెప్పారు.

వినాయకుడిని పూజిస్తే విఘ్నాలు తొలగి శుభాలు జరుగుతాయన్నారు. ఇంటింటా గణపతి పూజా చాలాకాలంగా ఉన్నప్పటికీ సామూహిక ఉత్సవాలకు బాలగంగాధర్ తిలక్ ప్రోత్సహించాడని గుర్తు చేశారు. దీనిద్వారా ప్రజలు ఒకచోట చేరి ఐక్యతను పెంపొందించుకొనే అవకాశం ఉంటుందన్నారు.

ఇది కూడా చదవండి..: Caste Census Demand | జనగణనలో కులగణనను తప్పనిసరి చేసి యూనిక్ కోడ్ కేటాయించాలి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *