అక్షరటుడే వెబ్‌డెస్క్: BC Caste Census | తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. రాబోయే 2027 జాతీయ జనగణనలో బీసీ, ఓబీసీ కులగణనను తప్పనిసరిగా చేర్చాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శుక్రవారం మీడియాతో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్రంలో బీసీల జనాభాపై ప్రభుత్వం వద్ద అత్యంత ప్రామాణికమైన, కచ్చితమైన గణాంకాలు ఉన్నాయని తెలిపారు. స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.
BC Caste Census | కేంద్రానికి విజ్ఞప్తి..
సుప్రీంకోర్టు విధించిన 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని దాటాలంటే సైంటిఫిక్ కుల గణాంకాలు చాలా అవసరమని, రాష్ట్రంలో విజయవంతంగా నిర్వహించిన సర్వే దానికి బలమైన ప్రాతిపదికగా నిలుస్తుందని మంత్రి వివరించారు. త్వరలో జరగబోయే దేశవ్యాప్త జనగణనలో బీసీ, ఓబీసీ వివరాలను స్పష్టంగా నమోదు చేయాలని, బీసీలకు జనాభా ప్రాతిపదికన పూర్తి న్యాయం జరగాలని కోరారు. “బీసీల జనాభాను సరిగ్గా లెక్కించండి.. వారికి తగినంత న్యాయం చేయండి” అని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. సామాజిక న్యాయం సాధించాలన్న లక్ష్యంతోనే తమ ప్రభుత్వం ఈ సర్వేను విజయవంతంగా పూర్తి చేసిందని, కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే బాటలో నడిచి బీసీ కులాల లెక్క తేల్చి న్యాయం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.
తెలంగాణలో నిర్వహించిన సమగ్ర కుల సర్వే దేశానికే రోల్ మోడల్‌గా నిలిచింది.
రాష్ట్రంలో బీసీల జనాభాకు సంబంధించిన ప్రామాణికమైన గణాంకాలు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం వద్ద ఉన్నాయి.
ఈ గణాంకాల ఆధారంగా బీసీలకు సామాజిక న్యాయం కల్పించేందుకు, విద్యా- ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు… pic.twitter.com/VcJ30xNrec— Ponnam Prabhakar (@Ponnam_INC) September 11, 2026
ఇది కూడా చదవండి: Nagpur Bank Robbery | బ్యాంకు సిబ్బంది కళ్లలో కారం చల్లి దోపిడీ