ACB raids | రిజిస్ట్రార్​ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB raids | హనుమకొండ (Hanmakonda) జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ (ACB), విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. ఫోన్‌పే ద్వారా డాక్యుమెంట్ రైటర్లు రిజిస్ట్రార్లకు మామూళ్లు పంపినట్లు సమాచారం. ఇందులో నుంచి ఉన్నతాధికారులకు వాటాలు వెళ్లినట్లు అనుమానాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు.

ACB raids | గతంలో సైతం..

హన్మకొండ రిజిస్ట్రార్​ కార్యాలయంలో గతంలో సైతం ఏసీబీ సోదాలు జరిగాయి. డబ్బులు ఇస్తేనే రిజిస్ట్రార్​ ఫైళ్లపై సంతకాలు చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో ఈ నెల 3న సోదాలు జరిపారు. ఆ సయమంలో కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్లు ఉన్నట్లు గుర్తించారు. వారి నుంచి రూ.45,500 స్వాధీనం చేసుకున్నారు. అదే ఆఫీస్​లో 20 రోజుల వ్యవధిలో మరోసారి తనిఖీలు చేపట్టడం గమనార్హం. తాజా దాడులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

దీనిని కూడా చదవండి : Police Insurance | పోలీసులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి కోటిన్నర బీమా ప్యాకేజీ!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *