అక్షరటుడే, వెబ్‌డెస్క్ : record voter turnout | తమిళనాడు (Tamil Nadu), పశ్చిమ బెంగాల్ (West Bengal)లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు అయింది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు గురువారం ఒకే దశలో పోలింగ్ జరిగింది. పశ్చిమ బెంగాల్‌లో తొలిదశ ఎన్నిక జరిగింది. రెండో దశ ఈ నెల 29న నిర్వహించనున్నారు.
రెండు రాష్ట్రాల్లో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. దీంతో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు అయింది. బెంగాల్‌లో 91.46 శాతం, తమిళనాడులో 84.41 శాతం ఓటింగ్ జరగడం గమనార్హం. గత ఎన్నికల్లో తమిళనాడులో 76.6 శాతం ఓటింగ్ జరిగింది. ఎన్నికల ఫలితాలు మే 4న విడుదల కానున్నాయి.
record voter turnout | హింసాత్మక ఘటనలు
బెంగాల్ మొదటి దశ ఎన్నికల్లో హింసాత్మక ఘటలు చోటు చేసుకున్నాయి. ముర్షిదాబాద్‌లోని నౌదాలో దుండగులు నాటు బాంబులు విసిరారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. టీఎంసీ కార్యకర్తలు (TMC Workers), పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకోగా.. పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. అసన్‌సోల్‌లో బీజేపీ నాయకురాలు అగ్నిమిత్రపాల్ కారుపై రాళ్లతో దాడి చేశారు. ముర్షిదాబాద్‌లో తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీల మధ్య ఘర్షణ చెలరేగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
record voter turnout | బీజేపీ అభ్యర్థిపై దాడి
దక్షిణ దినాజ్‌పూర్‌లో భారతీయ జనతా పార్టీ (BJP) అభ్యర్థి సుభేందు సర్కార్‌పై టీఎంసీ కార్యకర్తలు దాడి చేశారు. సర్కార్‌ను టీఎంసీ కార్యకర్తలు వెంబడించారు. కుమార్‌గంజ్ బీజేపీ అభ్యర్థి సుభేందు సర్కార్ మాట్లాడుతూ, నియోజకవర్గంలో 8-10 పోలింగ్ స్టేషన్లలో తమ పోలింగ్ ఏజెంట్లను బలవంతంగా తొలగించారని ఆరోపించారు. తాను జోక్యం చేసుకుని వారిని తిరిగి లోపలికి అనుమతించేలా చేశానని చెప్పారు. ఈ క్రమంలో కొందరు తనపై దాడి చేశారన్నారు.
దీనిని కూడా చదవండి : Supreme Court | జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చినా ఓకే.. కానీ వాట్సాప్ యూనివర్సిటీ నుంచి వద్దు: సుప్రీం జడ్జి

