Government Schemes | ప్రభుత్వ పథకాలను అర్హులకు అందేలా చూస్తాం: ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Government Schemes | ప్రభుత్వ పథకాలను అర్హులకు అందేలా చూస్తామని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు (MLA Laxmikanta Rao) అన్నారు. నిజాంసాగర్(Nizamsagar) మండలంలో గురువారం పలు అభివృద్ది కార్యక్రమాలను డీసీసీ అధ్యక్షుడు ఏలె మల్లిఖార్జున్​తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.

Government Schemes | మండలంలోని వడ్డేపల్లిలో..

మండలంలోని వడ్డేపల్లి(vaddepally) పాపేశ్వర ఆలయం నుండి నల్లగుట్ట తండావరకు నిర్మించనున్న సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.షెడ్యూల్డ్ ట్రైబ్ స్పెషల్ డెవలప్​మెంట్ (Scheduled Tribes Special Development)​ నిధుల ద్వారా ఈ నిర్మాణ పనులు చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే మండలంలో లబ్ధిదారులకు షాదీ ముబారక్ (Shaadi Mubarak), కల్యాణ లక్ష్మి(Kalyana Lakshmi) చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్​ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

11 2

ఇది కూడా చదవండి: Police Insurance | పోలీసులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి కోటిన్నర బీమా ప్యాకేజీ!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *