అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Fake Family Certificate | నకిలీ కుటుంబ ధ్రువీకరణ (ఫ్యామిలీ మెంబర్) పత్రాన్ని సృష్టించి, అన్నకు చెందిన ఇంటిపై రుణం తీసుకొని మోసానికి పాల్పడిన తమ్ముడిపై కేసు నమోదైంది. ఈ ఘటన నగరం (Nizamabad)లోని రెండో టౌన్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది.
Fake Family Certificate | శివాజీనగర్‌లో..
బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. నగరంలోని శివాజీనగర్‌లో 114.83 చదరపు గజాల ఇల్లు బాధితుడి తండ్రికి చెందింది. 2014 జూలై 7న ఆయన మరణించగా.. సదరు ఇంట్లో బాధితుడు తన కుటుంబంతో నివాసముంటున్నాడు. తమ్ముడు సంతోష్ 20 ఏళ్లుగా తన భార్యాపిల్లలతో కలిసి వేరుగా ఉంటున్నాడు. ఈ ఆస్తిపై సంతోష్‌కు ఎలాంటి హక్కులు లేవు.అయితే, సంతోష్ నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్‌తో పాటు ఇతర పత్రాలను సృష్టించి, సదరు ఆస్తికి తానే యజమానిగా చలామణి అయ్యాడు. వీటి ఆధారంగా ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో రుణం పొందాడు. ఆపై 2023లో కూడా అదే ఆస్తిపై రుణం తీసుకున్నాడు. రుణం వాయిదాలు చెల్లించకపోవడంతో సంస్థ ప్రతినిధులు బాధితుడి ఇంటికి రావడంతో ఈ మోసం బయటపడింది. దీనిపై బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: PACS Committees | సొసైటీల పాలకవర్గాల నియామకంలో కొత్తవారికే అవకాశం!