Rahul Gandhi Meeting | కాంగ్రెస్​ అగ్రనేతను కలిసిన పీసీసీ చీఫ్.. రాష్ట్రంలో తాజా రాజకీయాలపై చర్చ..

Shashi kiran Mottala
Rahul Gandhi Meeting | కాంగ్రెస్​ అగ్రనేతను కలిసిన పీసీసీ చీఫ్.. రాష్ట్రంలో తాజా రాజకీయాలపై చర్చ..

అక్షరటుడే, ఇందూరు: Rahul Gandhi Meeting | ఏఐసీసీ అగ్రనేత, లోక్​సభ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్​గాంధీని (Rahul Gandhi) టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) గురువారం కలిశారు. ఢిల్లీలోని (Delhi) 10 జన్ పథ్​లో రాహుల్ గాంధీని​ కలిసి పలు విషయాలపై చర్చించారు.

Rahul Gandhi Meeting | తాజా రాజకీయాలపై చర్చ..

రాష్ట్రంలో (Telangana politics) జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై రాహుల్ గాంధీకి పీసీసీ చీఫ్​ వివరించారు. తాజా రాజకీయ అంశాలపై ఇరువురు నేతలు 15 నిమిషాల పాటు చర్చించారు. రాష్ట్రంలో పార్టీ పరంగా జరుగుతున్న కార్యక్రమాలను స్పష్టంగా తెలియజేశారు. డీసీసీ అధ్యక్షుల నియామకాలు, జిల్లా కమిటీలు, మండల కమిటీలు, బీఎల్​ఏ, అనుబంధ సంఘాల నియామకాలు తదితర అంశాలపై సమావేశంలో రాహుల్ గాంధీకి వివరించారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులగణన జరిపించామన్నారు.

Rahul Gandhi Meeting | బీసీ రిజర్వేషన్ల అంశాన్ని సైతం..

మహిళ రిజర్వేషన్ల బిల్లులో బీసీ రిజర్వేషన్ల (BC Reservations) అంశాన్ని కూడా జోడించేలా మాట్లాడాలని రాహుల్​కు మహేష్​ కుమార్​ గౌడ్​ విజ్ఞప్తి చేశారు. రాబోయే ఏఐసీసీ జాతీయ ఓబీసీ సలహా మండలి సమావేశాన్ని హైదరాబాద్​లో నిర్వహించాలని కోరారు. అంతకు ముందు రాజ్యసభ ఎంపీ అనిల్ యాదవ్, మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు సైతం రాహుల్​గాంధీతో భేటీ అయ్యారు.

ఇది కూడా చదవండి : Kaleshwaram Project | కాళేశ్వరంపై సుప్రీంకోర్టుకు.. కేబినెట్ కీలక నిర్ణయం

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *