తెలంగాణKaleshwaram Project | కాళేశ్వరంపై సుప్రీంకోర్టుకు.. కేబినెట్ కీలక నిర్ణయం

Kaleshwaram Project | కాళేశ్వరంపై సుప్రీంకోర్టుకు.. కేబినెట్ కీలక నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్​ను సవాల్​ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kaleshwaram Project | తెలంగాణ కేబినెట్ (Cabinet) కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు (High Court) ఇచ్చిన జడ్జిమెంట్​ను సవాల్​ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించాలని మంత్రివర్గం నిర్ణయించింది.

కాళేశ్వరం ప్రాజెక్ట్​పై పీసీ ఘోష్​ కమిషన్ (PC Gosh Commission)​ నివేదికపై హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ నివేదిక ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్ (KCR)​, మాజీ మంత్రి హరీశ్​రావుపై ఎలాంటి చర్యలు చేపట్టొద్దని ఆదేశించింది. దీంతో ఈ వ్యవహారంలో వారికి ఊరట లభించింది. ఈ క్రమంలో హైకోర్టు తీర్పుపై దేశ అత్యున్నత ధర్మాసనంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రాజెక్టు రీడిజైనింగ్, వ్యయం, ఇతర అంశాలపై గతంలో వచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని ప్రభుత్వం కోరనుంది.

Kaleshwaram Project | కీలక తీర్మానాలు

సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన గురువారం మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్​లో ప్రధానంగా కాళేశ్వరం కమిషన్​ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద చర్చ జరిగింది. ప్రాజెక్టు సాంకేతిక, న్యాయపరమైన అంశాలను అత్యున్నత న్యాయస్థానంలో బలంగా వినిపించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాగా కాళేశ్వరంలో భారీగా అవినీతి, అక్రమాలు జరిగాయని కాంగ్రెస్​ ఆరోపిస్తోంది. పీసీ ఘోష్​ కమిషన్​ రిపోర్టు సైతం ఇదే స్పష్టం చేసింది. అయితే కమిషన్​ రిపోర్టు ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టొద్దని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో బీఆర్​ఎస్​ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఈ కేసులో కేసీఆర్​, హరీష్ రావుతో పాటు ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్, ఎస్ కే జోషిలకు ఊరట లభించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్​ చేయాలని కాంగ్రెస్​ ప్రభుత్వం నిర్ణయించింది.

దీనిని కూడా చదవండి : RTC Strike Loss | సమ్మె ఎఫెక్ట్.. ఒక్కరోజే రూ.17 కోట్లకు పైగా నష్టం!

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....