తెలంగాణVasavi Matha Jayanthi | రాష్ట్ర పండుగగా వాసవీ మాత జయంతి!

Vasavi Matha Jayanthi | రాష్ట్ర పండుగగా వాసవీ మాత జయంతి!

వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vasavi Matha Jayanthi | తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర సంస్కృతిని గౌరవిస్తూ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలను ప్రతి సంవత్సరం రాష్ట్ర పండుగగా (State Function) నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (GAD) ఉత్తర్వులు జారీ చేస్తూ పూర్తి వివరాలను వెల్లడించింది.

ప్రతి సంవత్సరం ‘వైశాఖ శుక్ల పక్ష దశమి’ తిథి నాడు శ్రీ వాసవీ మాత జయంతిని తెలంగాణ ప్రభుత్వం తరపున అధికారికంగా నిర్వహిస్తారు. ప్రస్తుత 2026 సంవత్సరంలో ఈ పవిత్ర తిథి ఏప్రిల్ 26వ తేదీన రావడంతో, ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Vasavi Matha Jayanthi | అత్యంత వైభవంగా

రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు తమ పరిధిలో ఈ జయంతి వేడుకలను అధికారిక లాంఛనాలతో, అత్యంత వైభవంగా నిర్వహించాలని సీఎస్ ఆదేశించారు. ఈ వేడుకల పర్యవేక్షణ బాధ్యతను ‘యువజన సర్వీసులు, పర్యాటక , సాంస్కృతిక శాఖ’కు (YAT&C Department) అప్పగించారు. ఈ వేడుకలకు అయ్యే ఖర్చును ఆయా శాఖల బడ్జెట్ నుంచే కేటాయించాలని స్పష్టం చేశారు.

Vasavi Matha Jayanthi | ప్రభుత్వంపై ప్రశంసలు

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఈ ఉత్తర్వులపై సంతకం చేశారు. దీనికి సంబంధించిన ప్రతిలను డీజీపీ, కలెక్టర్లు , అన్ని ప్రభుత్వ శాఖలకు సమాచారం నిమిత్తం పంపారు. వాసవీ మాత జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం పట్ల ఆర్యవైశ్య సంఘాలు , భక్తులు ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాసవీ దేవాలయాల్లో ఏప్రిల్ 26న ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

 

దీనిని కూడా చదవండి : Kavitha new party | ఎల్లుండి కవిత కొత్త పార్టీ.. పేరు అదేనా..

 

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....