Kavitha new party | ఎల్లుండి కవిత కొత్త పార్టీ.. పేరు అదేనా..

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kavitha new party | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఈ నెల 25న కొత్త పార్టీని ప్రకటించనున్నారు. ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరిట పార్టీ పేరు కోసం ఆమె దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.

బీఆర్​ఎస్ (BRS)​ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కవిత సొంత పార్టీ ఏర్పాటు కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మేరకు తొలుత జాగృతిని బలోపేతం చేశారు. తన తండ్రి పేరు లేకుండానే సొంతంగా జనంలోకి వెళ్లారు. పలు ప్రజా సమస్యలపై పోరాటాలు చేశారు. జనంబాట పేరిట అన్ని జిల్లాల్లో పర్యటించారు. ఈ క్రమంలో తాజాగా కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారులు, అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్తామని ఆమె ప్రకటించారు. దీంతో ఆమె పార్టీ ఏర్పాటుపై అనేక అంచనాలు ఉన్నాయి.

Kavitha new party | సక్సెస్​ అవుతారా..

రాష్ట్రంలో ఇటీవల అనేక కొత్త పార్టీలు వచ్చాయి. అయితే వచ్చిన పార్టీల్లో చాలా వరకు కనుమరుగు అయ్యాయి. ఇటీవల ఎమ్మెల్సీ తీన్మార్​ మల్లన్న (Teenmaar Mallanna) తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అయితే స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీ అంతగా ప్రభావం చూపలేదు. అయితే కవిత పార్టీ జనామోదం పొందుతుందా.. లేదా అన్నది చూడాలి. కాంగ్రెస్​తో పాటు, బీఆర్​ఎస్​, బీజేపీలపై విమర్శలతో విరుచుకుపడుతున్న కవిత జనంలోకి పెద్ద ఎత్తున పార్టీని తీసుకు వెళ్లాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఇటీవల జాగృతిలో భారీగా చేరికలు సాగాయి. బోథ్​ మాజీ ఎమ్మెల్యే బాపూరావు సైతం జాగృతి కండువా కప్పుకున్నారు.

Kavitha new party | మహిళలు ఏర్పాటు చేసిన పార్టీలు

రాష్ట్రంలో అనేక పార్టీలు ఏర్పాటు అయినా.. మహిళలు స్థాపించనవి తక్కువగా ఉన్నాయి. గతంలో సినీ నటి విజయశాతం తల్లి తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశారు. అనంతరం దానిని నాటి టీఆర్​ఎస్​లో విలీనం చేశారు. అలాగే గత ఎన్నికలకు ముందు వైఎస్​ షర్మిల వైఎస్​ఆర్​ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశారు. ఎన్నికల అనంతరం దానిని కాంగ్రెస్​లో విలీనం చేసిన ఆమె.. తన రాజకీయ వేదికను తెలంగాణ నుంచి ఏపీకి మార్చారు. ఇప్పుడు కాంగ్రెస్​ రాష్ట్ర అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. తాజాగా కేసీఆర్​ (KCR) కూతురు కవిత పార్టీ ఏర్పాటు చేయనున్నారు. దీనిని ఆమె ఎలా ముందుకు తీసుకు వెళ్తారో చూడాలి.

Kavitha new party | మహిళలకు రిజర్వేషన్​

తమ పార్టీలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఉంటుందని కవిత చెబుతున్నారు. పార్టీ పదవులు, సీట్ల కేటాయింపులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్​ ఇస్తామని ప్రకటించారు. అలాగే యువతకు సైతం అవాశాలు ఉంటాయని స్పష్టం చేశారు. మరోవైపు కార్మికులు, వివిధ వర్గాల వారిని ఆమె కలుపుకుంటున్నారు. ఇప్పటికే సింగరేణిలో ఓ సంస్థతో కలిసి పని చేస్తున్నారు. ధర్మ సమాజ్​ పార్టీతో కలిసి ఇటీవల వెలుగుమట్ల బాధితుల కోసం నిరాహార దీక్ష చేశారు. అయితే కవిత పార్టీని ప్రజలు ఆమోదిస్తారా.. లేదా అనేది చూడాలి. త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఆమె పార్టీ పోటీ చేసే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి..: RTC Strike | కల్వకుర్తిలో ఉద్రిక్తత.. ప్రైవేట్ బస్సు డ్రైవర్‌పై కారం చల్లిన ఆర్టీసీ కార్మికులు!

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *