జాతీయంKacheguda Sri Ganganagar Express | ఉత్తరాది వెళ్లే వారికి శుభవార్త.. కాచిగూడ -శ్రీగంగానగర్ వీక్లీ...

Kacheguda Sri Ganganagar Express | ఉత్తరాది వెళ్లే వారికి శుభవార్త.. కాచిగూడ -శ్రీగంగానగర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ క్రమబద్ధీకరణ

ఉత్తరాదికి వెళ్లే ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే శుభవార్త తెలిపింది. కాచిగూడ -శ్రీగంగానగర్ మధ్య కొత్తగా వీక్లీ ఎక్స్‌ప్రెస్ ను రెగ్యులరైజ్ చేసింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kacheguda Sri Ganganagar Express | ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లివచ్చే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో ప్రత్యేక రైలుగా నడిచిన కాచిగూడ – శ్రీగంగానగర్ వీక్లీ స్పెషల్ రైలు సర్వీసును క్రమబద్ధీకరిస్తున్నట్లు ప్రకటించింది.

ఈ నిర్ణయంతో ప్రయాణికులకు మరింత మెరుగైన కనెక్టివిటీ అందుబాటులోకి రానుంది. రైలు నంబర్ 07053/07054 తో నడిచిన వీక్లీ స్పెషల్ రైలు (Weekly Special Train) షెడ్యూల్‌ను కూడా మార్చారు. కొత్త రెగ్యులర్ రైలు సర్వీసులు జూలై నెల నుంచి అందుబాటులోకి రానున్నాయి.

Kacheguda Sri Ganganagar Express | కోచ్‌ల వివరాలు..

ఈ రైలులో టూ టైర్ ఏసీ కోచ్‌లు (2ఏ) రెండు, త్రీ టైర్ ఏసీ కోచ్‌లు (3ఏ): ఎనిమిది, స్లీపర్ క్లాస్ కోచ్‌లు ఆరు, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు నాలుగు ఉంటాయి.

Kacheguda Sri Ganganagar Express | షెడ్యూల్ ఇలా..

ట్రైన్ నంబర్ 17601 (కాచిగూడ – శ్రీగంగానగర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్) రైలు ప్రతి శనివారం కాచిగూడ నుంచి బయలుదేరుతుంది. ఈ రెగ్యులర్ సర్వీసు జూలై 25వ తేదీన ప్రారంభం కానుంది.

ట్రైన్ నంబర్ 17602 (శ్రీగంగానగర్ – కాచిగూడ వీక్లీ ఎక్స్‌ప్రెస్) రైలు ప్రతి మంగళవారం శ్రీగంగానగర్ నుంచి తిరుగు పయనమవుతుంది. ఈ రెగ్యులర్ సర్వీసు జూలై 28న అందుబాటులోకి వస్తుంది.

Kacheguda Sri Ganganagar Express | టైమింగ్స్ వివరాలు..

కాచిగూడ – శ్రీగంగానగర్ మధ్య నడిచే వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు తెలంగాణ (Telangana), మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ మీదుగా పంజాబ్/హర్యానా సరిహద్దుల్లోని శ్రీగంగానగర్ వరకు ప్రయాణిస్తుంది. కాచిగూడ నుంచి శనివారం రాత్రి 22 గంటలకు బయలుదేరి సోమవారం రాత్రి 21.30 గంటలకు శ్రీగంగానగర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో శ్రీగంగానగర్‌లో మంగళవారం ఉదయం 06.55 గంటలకు బయలుదేరి గురువారం ఉదయం 07.15 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.

ఈ రైలు మల్కాజ్‌గిరి, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ధర్మాబాద్, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణా, అకోలా, మల్కాపూర్, హర్దా, ఇటార్సి, భోపాల్, ఉజ్జయిని, కోట, జైపూర్, సికార్, చురు, బికనీర్, సూరత్‌గఢ్ , శ్రీ కరణ్‌పూర్ వంటి రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. తెలుగు రాష్ట్రాల నుంచి రాజస్థాన్‌లోని జైపూర్, బికనీర్ వంటి పర్యాటక ప్రాంతాలకు వెళ్లే వారికి ఈ రైలు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించవచ్చు.

ఇది కూడా చదవండి..: LIC New Jeevan Saathi | ఒకే ప్లాన్‌తో భార్యాభర్తలిద్దరికీ బీమా.. న్యూ జీవన్ సాతి పేరుతో లాంచ్ చేసిన ఎల్ఐసీ

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Kamareddy Train Accident | రైలు ఢీకొని గొర్లు మృతి..

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Train Accident | రైలు ఢీకొని గొర్లు...

Samantha Fan Proposal | మా ఇంటి బంగారం ఈవెంట్‌లో సమంతకు ఫ్యాన్ ప్రపోజల్.. స్టేజ్‌పై జరిగిన ఘటన వైరల్

అక్షరటుడే, వెబ్​డెస్క్: Samantha Fan Proposal | స్టార్ హీరోయిన్ సమంత...

Working Women Safety | వర్కింగ్ ఉమెన్ భద్రత ప్రభుత్వ బాధ్యత : మంత్రి సీతక్క

అక్షరటుడే, వెబ్​డెస్క్: Working Women Safety | హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్...

Odisha Septic Tank Tragedy | ఒడిశాలో విషాదం.. సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తూ ఆరుగురు కూలీల మృతి

అక్షరటుడే, వెబ్‌డెస్క్: Odisha Septic Tank Tragedy | ఒడిశాలోని కలహండి...