Export Duty Fuel | పెట్రోల్​, డీజిల్​పై ఎగుమతి​ సుంకం తగ్గించిన కేంద్రం

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Export Duty Fuel | పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంక్షోభం వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్​, డీజిల్​పై ఎగుమతి సుంకాలను తగ్గించింది. దేశంలో చమురు సంక్షోభం తలెత్తకుండా కేంద్రం ఎగుమతి సుంకాలను విధించింది. తాజాగా వాటిని సవరించింది.

Export Duty Fuel

ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన తాజా నోటిఫికేషన్‌లో, ఎగుమతులపై విధించే సుంకం రేట్లను సవరించారు. పెట్రోల్‌పై లీటరుకు రూ.1.5, డీజిల్‌పై లీటరుకు రూ.13.5 మరియు ATF (విమాన ఇంధనం) పై లీటరుకు ₹9.5 గా నిర్ణయించారు. ఎగుమతి సుంకం రేట్లను ప్రతి పక్షం రోజులకోసారి సవరిస్తుంటారు. ఈ సవరణలు ముడి చమురు సగటు అంతర్జాతీయ ధరల ఆధారంగా జరుగుతాయి. దీంతో భారత్​ (India)లో ఇంధన ధరలపై ఎలాంటి ప్రభావం ఉండదు.

Export Duty Fuel | ఎక్సైజ్​ సుంకంలో మార్పులేదు

Export Duty Fuel

దేశీయ వినియోగం కోసం సరఫరా చేసే పెట్రోల్ మరియు డీజిల్‌పై ప్రస్తుతం అమల్లో ఉన్న ఎక్సైజ్ సుంకం రేట్లలో ఎటువంటి మార్పు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. మే 16న, ఆర్థిక మంత్రిత్వ శాఖ పెట్రోల్‌పై ఎగుమతి సుంకాన్ని ‘సున్నా’ స్థాయి నుండి లీటరుకు రూ.3కి పెంచింది. అదే సమయంలో డీజిల్ రూ.16.5 ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ATF) పై ఎగుమతి సుంకాన్ని రూ.6కి తగ్గించింది.

ఇది కూడా చదవండి..: Tourist Taxi Accident | లోయలో పడిన ట్యాక్సీ.. ఇద్దరు చిన్నారులు సహా 8 మంది గల్లంతు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *