అక్షరటుడే, వెబ్‌డెస్క్: UP Road Accident | ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh)లోని అంబేద్కర్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గోరఖ్‌పూర్ లింక్ ఎక్స్‌ప్రెస్‌వేపై బస్సు మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.
జైత్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోరఖ్‌పూర్ లింక్ ఎక్స్‌ప్రెస్‌వేపై శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. బీహార్ నుంచి వస్తున్న వోల్వో బస్సు, ఒక ట్రైలర్ ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంతో ఎక్స్‌ప్రెస్‌వేపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.
UP Road Accident | కేసు నమోదు
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాల గురించి విచారిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాద తీవ్రతకు బస్సు తీవ్రంగా ధ్వంసమైంది. ప్రమాదం జరిగినప్పుడు బస్సు గంటకు దాదాపు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రమాదం అనంతరం డ్రైవర్, కండక్టర్, ట్రైలర్ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయారు. బస్సు డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటంతో ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: TMC Bank Accounts | మమతా బెనర్జీకి షాక్.. రూ. 804 కోట్ల ఫండ్స్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు