అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Archery Gold Medal | ఆసియా క్రీడల్లో భాగంగా ఆర్చరీలో భారత క్రీడాకారులు అదరగొడుతున్నారు. ఇప్పటికే కాంపౌండ్ విభాగంలో మూడు బంగారు పతకాలు సాధించిన భారత్ తాజాగా రికర్వ్ విభాగంలో ఓ స్వర్ణం, ఓ రజతం గెలుచుకుంది.భారత మహిళల రికర్వ్ ఆర్చరీ జట్టు చరిత్ర సృష్టించింది. అంకితా భకత్, కీర్తి, కుంకుమ్ మొహోద్‌తో కూడిన జట్టు శుక్రవారం దక్షిణ కొరియాను ఓడించి పసిడి గెలుచుకుంది.
భారత్ (India) చరిత్ర సృష్టించింది. నాలుగో సెట్‌లో కొరియా 54 పాయింట్లు సాధించింది. కీర్తి 8 పాయింట్లతో ప్రారంభించి, ఆ తర్వాత నిర్ణయాత్మకంగా దానిని 9కి మార్చింది. దీంతో భారత్ మొత్తం పాయింట్లు 54కు చేరి, స్కోరును సమం చేసి సెట్‌ను డ్రాగా ముగించి, స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. దశాబ్దాలుగా ప్రధాన ఫైనల్స్‌లో ఏ జట్టు చేతిలోనూ ఓడిపోని సౌత్ కొరియాను తాజాగా భారత్ ఓడించింది. వారు 10 సార్లు ఒలింపిక్ ఛాంపియన్లు, చివరిసారిగా పారిస్ ఒలింపిక్స్‌లో విజయం సాధించారు. వారిని భారత్ వరుస సెట్లలో ఓడించి చరిత్ర సృష్టించింది.
Archery Gold Medal | రికర్వ్ మిక్స్‌డ్‌లో
ఆర్చరీ రికర్వ్ మిక్స్డ్ విభాగంలో భారత్ ఫైనల్లో ఓడిపోయింది. దీంతో సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకుంది. చైనాతో జరిగిన ఫైనల్లో ధీరజ్ బొమ్మదేవర, కుంకుమ్ అనిల్ మోహోద్ టీమ్ 3–5 తేడాతో ఓడిపోయింది. అంతకుముందు వీరు సెమీఫైనల్‌లో జపాన్‌ను 5–3 తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరుకున్నారు. పసిడి పోరులో చైనా క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చేయడంతో భారత్ రజతంతో సరిపెట్టుకుంది. ఇతర క్రీడల్లో భారత్ పతకాలు రేసులో ఉంది. బాక్సింగ్లోలవ్లీనా బోర్గోహైన్, పర్వీన్, అంకుష్ ఫైనల్ చేరారు. నేడు మధ్యాహ్నం పసిడి కోసం మహిళల హాకీ జట్టు చైనాతో తలపడనుంది. ప్రస్తుతం భారత్ 11 స్వర్ణాలు, 24 రజత, 33 కాంస్య పతకాలతో 7వ స్థానంలో ఉంది.
ఇది కూడా చదవండి..: ICC World Cup 2027 | 2027 వన్డే వరల్డ్ కప్: షెడ్యూల్ విడుదల.. ఆసీస్‌తో భారత్ తొలి పోరు, పాక్‌తో మ్యాచ్ ఆ రోజే!