అక్షరటుడే, వెబ్డెస్క్ : Lovlina Borgohain | ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ సంచలనం సృష్టించింది. ఫైనల్లో ఘన విజయం సాధించి పసిడి పతకం గెలుచుకుంది.
జపాన్లోని ఐచి-నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో (Asian Games) శుక్రవారం లవ్లీనా తన పంచులతో పసిడి గెలుచుకుంది. 75 కేజీల విభాగంలో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. చైనాకు చెందిన బావో జియిను ఓడించింది. దీంతో భారత పసిడి పతకాల సంఖ్య 12కు చేరింది. మహిళల డింగీ సెయిలింగ్ విభాగంలో భారత్కు చెందిన నేత్ర కుమనన్ కాంస్య పతకం గెలుచుకుంది. పతకాలు గెలిచిన క్రీడాకారులను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అభినందించారు. పతకాల పట్టికలో భారత్ ఆరో స్థానానికి చేరింది.
ఇది కూడా చదవండి..: Archery Gold Medal | ఆర్చరీలో మరో బంగారు పతకం