Vaibhav Suryavanshi Innings | వైభవ్​ భారీ ఇన్నింగ్స్​.. భారత్​ ఘన విజయం

జింబాబ్వేతో జరిగిన మూడో టీ 20లో భారత్ ఘన విజయం సాధించింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vaibhav Suryavanshi Innings | జింబాబ్వేతో జరిగిన మూడో టీ 20లో భారత్ (Bharat) ఘన విజయం సాధించింది. భారత ఓపెనర్​, చిచ్చర పిడుగు వైభవ్​ సూర్యవంశీ రెచ్చిపోవడంతో తొలి ఇన్నింగ్స్​లో భారత్ భారీ స్కోర్​ చేసింది.

మూడో టీ 20లో టాస్​ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఆది నుంచే భారత బుడ్డోడు వైభవ్​ జింబాబ్వే (Zimbabwe) బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మరో ఓపెనర్​ అభిషేక్​ శర్మ (2) మరోసారి విఫలం అయిన సూర్యవంశీ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. 49 బంతుల్లో 81 పరుగులు చేశాడు. అందులో 8 ఫోర్లు, 4 సిక్స్​లు ఉన్నాయి. వైభవ్​ 102 మీటర్ల భారీ సిక్సర్​ కొట్టడం గమనార్హం. ఇషాన్​ కిషన్ (Ishan Kishan)​ 29, శ్రేయస్​ అయ్యార్​ 27 పరుగులతో రాణించారు. చివర్లో రింక్​ సింగ్​ 14 బంతుల్లో 25 పరుగులు చేశాడు. దీంతో భారత్​ 192 పరుగులు చేసింది.

Vaibhav Suryavanshi Innings | తడబడ్డ జింబాబ్వే

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే ఆదిలోనే వికెట్​ కోల్పోయింది. తొలి బంతికే ఓపెనర్​ బెన్నెట్ ఔట్​ అయ్యాడు. కురన్​ 20, మేయర్స్​ 19 పరుగులతో వికెట్​ పడకుండా జాగ్రత్త పడ్డారు. ర్యాన్​ బుర్ల్​ 54 పరుగులతో రాణించాడు. భారత బౌలర్లో మయాంక్​ యాదవ్ 3, యష్​ ఠాకూర్​ 2 వికెట్లు తీశారు. దీంతో జింబాబ్వే 20 ఓవర్లలో 157 పరుగులు చేసింది. భారత జట్టు 35 పరుగుల తేడాతో విజయం సాధించింది.

 

దీనిని కూడా చదవండి : Komuravelli Railway Station | కొమురవెల్లి రైల్వే స్టేషన్​ ప్రారంభం.. తీరనున్న భక్తుల కష్టాలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.