Exam Reforms Task Force | పరీక్షల సంస్కరణకు టాస్క్​ఫోర్స్​.. మరో వీడియో విడుదల చేసిన మోదీ

పరీక్షల సంస్కరణకు శ్రీకారం చుట్టామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Exam Reforms Task Force | పరీక్షల సంస్కరణకు శ్రీకారం చుట్టామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తెలిపారు. ఈ మేరకు ఆయన మరో వీడియో విడుదల చేశారు. విద్యార్థుల భవిష్యత్‌ కోసం నిరంతరం చర్యలు తీసుకుంటున్నామన్నారు.

పరీక్షా విధానాలను ఎలా మెరుగుపరచాలనే దానిపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు, ఇన్ఫోసిస్ (Infosys) సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని నేతృత్వంలో ఒక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మోదీ తెలిపారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థుల భవిష్యత్​ కోసం తమ ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పేపర్​ లీకేజీలకు పాల్పడిన వారు జైళ్లలో మగ్గుతున్నారని చెప్పారు.

Exam Reforms Task Force | కొత్త చట్టం తెస్తాం

ఫాస్ట్-ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశామని ప్రధాని తెలిపారు. పార్లమెంటులో కూడా, కఠినమైన చట్టపరమైన నిబంధనలతో కూడిన కొత్త చట్టాన్ని రూపొందించే దిశగా అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు.

Exam Reforms Task Force | టాస్క్​ఫోర్స్​ సభ్యులు వీరే..

పరీక్షల విధానంపై సంస్కరణల కోసం ఏర్పాటు చేయనున్న టాస్క్​ఫోర్స్​లో నీలేకనితో పాటు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు కూడా సభ్యులుగా ఉన్నారు. ఇస్రో మాజీ ఛైర్మన్ ఎస్. సోమనాథ్, ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ తపన్ దేకా, ఐఐటీ చెన్నై డైరెక్టర్ వి. కామకోటి, మాజీ విద్యాశాఖ కార్యదర్శి అనితా కవల్, లాజిస్టిక్స్ నిపుణుడు అమృత్ లాల్ మీనా ఉన్నారు.

 

దీనిని కూడా చదవండి : Komuravelli Railway Station | కొమురవెల్లి రైల్వే స్టేషన్​ ప్రారంభం.. తీరనున్న భక్తుల కష్టాలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *