Hit and Run Case | గుర్​గ్రామ్​ హిట్​ అండ్​ రన్​ కేసులో నిందితుడి అరెస్ట్​

గురుగ్రామ్​లో బైక్​పై వెళ్తున్న యువతిని కారుతో ఢీకొట్టి పారిపోయిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hit and Run Case | గురుగ్రామ్​ హిట్​ అండ్​ రన్​ కేసులో నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఓ యువతి తన ‘ఏప్రిలియా RS 457’ స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తుండగా ఓ వ్యక్తి కారుతో ఢీకొట్టాడు. నిందితుడు కళ్యాణ్ బైన్స్‌లాను రాజస్థాన్‌ (Rajasthan)లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై స్పోర్ట్స్​ బైక్​పై వెళ్తుండగా.. ఓ కారు యువతిని ఢీకొట్టింది. హెల్మెట్ ధరించి వెళ్తున్న సియాను బలంగా ఢీకొట్టింది. దీనివల్ల ఆమె కింద పడిపోగా, ఆమె బైక్ రోడ్డుపై జారుతూ వెళ్తూ నిప్పురవ్వలు రేపింది. ఈ ఘటనలో యువతి తీవ్రంగా గాయపడింది. ఈ వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్ అయ్యాయి.

Hit and Run Case | హత్యాయత్నం కేసు

దీనిపై బాధితురాలు, ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడికి శిక్ష పడే వరకు తాము ఆందోళన చేస్తామన్నారు. “ఒక మహిళను ఢీకొట్టి వేగంగా వెళ్లిపోతే తనకు ఏమీ కాదని అతను అనుకున్నాడు,” అని బాధితురాలు పేర్కొన్నారు. ఈ క్రమంలో పోలీసులు నిందితుడు కళ్యాణ్ బైన్స్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. తాజాగా రాజస్థాన్​లో అరెస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి..: Oracle Layoffs | ఈ రోజే మీ చివరి రోజు.. ఉద్యోగులకు ఒరాకిల్ షాక్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *