Kamareddy Road Accident | రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి దుర్మరణం

రాయల్ దాబాను దాటిన అనంతరం బైక్‌పై వెళ్తున్న విద్యార్థిని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకుడు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.

Naresh Chandan

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Road Accident | కామారెడ్డి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి దుర్మరణం చెందాడు. బైక్‌పై హైదరాబాద్ వైపు వెళ్తుండగా లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం.. రాయల్ దాబాను దాటిన అనంతరం బైక్‌పై వెళ్తున్న విద్యార్థిని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకుడు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.

Kamareddy Road Accident | యువకుడు నల్గొండ జిల్లా వాసి..

మృతుడిని నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం అజ్జలపల్లి గ్రామానికి చెందిన ఉప్పునూతల నందు (20)గా గుర్తించారు. యువకుడు బీటెక్‌ ఫైనల్ ఇయర్ చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Bihar SUV Rooftop | దొంగల భయం.. ఏకంగా ఇంటి పైకప్పుపైకి SUV.. బిహార్‌లో ఘటన

ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. విద్యార్థి మృతితో అజ్జలపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *