Telangana Assembly Black Dress Protest | రాజకీయ వేడి పెంచిన నల్ల చొక్కా వివాదం..అసెంబ్లీలో ప్రతిపక్షాల నిరసనలపై ఆసక్తికర చర్చ!

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Telangana Assembly Black Dress Protest | తెలంగాణ Telangana అసెంబ్లీ ప్రాంగణంలో బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు బ్లాక్ టీ-షర్టులు ధరించి చేపట్టిన నిరసన.. ఆ తదుపరి పోలీసులతో జరిగిన తోపులాట, అరెస్టుల ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ప్రతిపక్ష నేతలను అసెంబ్లీ Assembly లోకి వెళ్లకుండా అడ్డుకోవడంపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చట్టంలో డ్రెస్ కోడ్ ఉందా? రాజ్యాంగం, రూల్ బుక్ ఏం చెబుతున్నాయి? ఈ నిరసన నేపథ్యంలో నల్ల దుస్తులు ధరించి సభకు హాజరుకావడంపై సర్వత్రా ఆసక్తికరమైన చర్చ నెలకొంది.

Telangana Assembly Black Dress Protest | నిబంధనలు ఏం చెబుతున్నాయి..?

సభకు హాజరయ్యే సభ్యులు నిర్దిష్టమైన రంగు దుస్తులు మాత్రమే ధరించాలని రాజ్యాంగంలో గానీ, పార్లమెంట్ / అసెంబ్లీ రూల్ బుక్‌లో గానీ ఎక్కడా పేర్కొనబడలేదు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు ప్రతిపక్షాలు నల్ల దుస్తులను ఆయుధంగా ఉపయోగించడం సాధారణంగా జరుగుతుంటుంది.

National Film Awards | నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌ వేడుకకు కొత్త వేదిక.. తొలిసారి ఢిల్లీ వెలుపల నిర్వహణ

రూల్ బుక్ ప్రకారం రంగుతో సంబంధం లేకుండా సభ్యులు హాజరుకావచ్చు. అయితే, దుస్తులపై అభ్యంతరకర నినాదాలు ముద్రించి ఉన్నా.. ప్లకార్డులతో సభలోకి రావడానికి ప్రయత్నించినా మాత్రమే అడ్డుకునేందుకు నిబంధనలు వర్తిస్తాయి.

Telangana Assembly Black Dress Protest | గతంలోనూ ‘నల్ల రంగు’ నిరసనలు

ఈ రకమైన నిరసనలు కేవలం తెలంగాణకే పరిమితం కాదని, గతంలో పార్లమెంట్, పలు రాష్ట్రాల శాసనసభల్లో చోటుచేసుకున్నాయని విశ్లేషణలు చెబుతున్నాయి. మణిపూర్ హింసాత్మక ఘటనల (ఆగస్టు 2023) సమయంలో ప్రధాని ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ‘ఇండియా’ (INDIA) కూటమి ఎంపీలు నల్ల దుస్తులు ధరించి పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేపట్టారు.

ధరల పెరుగుదల & జీఎస్టీ (2022) పెంపునకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీలతో పాటు పలువురు ఎంపీలు బ్లాక్ డ్రెస్సుల్లో నిరసన తెలిపారు.

నీట్ పేపర్ లీకేజీ (జులై 2024), అదానీ అంశాలపై కూడా కాంగ్రెస్ నాయకులు నల్ల చొక్కాలు ధరించి జేపీసీ దర్యాప్తుకై ప్లకార్డులతో నిరసనలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ టీడీపీ సభ్యులు నల్ల చొక్కాలతో సభకు రావడం, మహారాష్ట్ర (పంట నష్టం పరిహారం), కేరళ, కర్ణాటక, తమిళనాడు శాసనసభల్లోనూ ప్రతిపక్షాలు ఇదే రీతిలో నిరసనలు తెలిపిన ఉదాహరణలు ఉన్నాయి.

Telangana Assembly Black Dress Protest | అరెస్టు ఎందుకు చేశారని చెబుతున్నారంటే..

ఢిల్లీ పార్లమెంట్‌లో కాంగ్రెస్, ఇతర విపక్ష నేతలు బ్లాక్ డ్రెస్సులతో స్వేచ్ఛగా నిరసనలు తెలిపిన సందర్భాలు ఉన్నప్పటికీ, తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేయడంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీ-షర్టులపై నినాదాలు రాయడం వల్లే పోలీసులు అడ్డుకున్నారని ఒకవైపు చెబుతుండగా.. ప్రతిపక్ష గొంతు నొక్కడమేనని బీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *