నిజామాబాద్Kamareddy Highway Busstand | కామారెడ్డిలో హైవే బస్టాండ్ ఏర్పాటు చేయాలి..

Kamareddy Highway Busstand | కామారెడ్డిలో హైవే బస్టాండ్ ఏర్పాటు చేయాలి..

కామారెడ్డి పట్టణంలో కొత్త హైవే బస్టాండ్ ఏర్పాటు చేయాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కోరారు. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​కు వినతిపత్రం అందజేశారు.

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Highway Busstand | జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణంలో కొత్త హైవే బస్టాండ్(RTC Bus Stand) ఏర్పాటు చేయాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి.. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు (Minister Ponnam Prabhakar) విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు.

Kamareddy Highway Busstand | కామారెడ్డిలో లక్షకు పైగా జనాభా..

కామారెడ్డి (Kamareddy) పట్టణ జనాభా లక్షకు పైగా ఉందని, పట్టణం నలువైపులా వేగంగా విస్తరిస్తోందన్నారు. ప్రస్తుతం ఉన్న బస్టాండ్ విస్తీర్ణం చాలా తక్కువ అని, దీంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. 44వ జాతీయ రహదారి విస్తరణతో ఆర్మూర్, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నాగ్‌పూర్, కోరుట్ల(korutla), మెట్‌పల్లి ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు కామారెడ్డి పట్టణంలోకి రావడం లేదని మంత్రికి వివరించారు. నాన్​స్టాప్ బస్సుల వల్ల ప్రయాణికులు నష్టపోతున్నారని పేర్కొన్నారు.

44వ జాతీయ రహదారి పక్కన ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని, ఆర్టీసీకి అనుకూలంగా ఉన్న ఈ స్థలంలో నాన్​స్టాప్ లేదా హైవే బస్టాండ్ ఏర్పాటు చేస్తే సమస్య తీరుతుందన్నారు. తద్వారా ఉమ్మడి నిజామాబాద్(Nizamabad), ఆదిలాబాద్(adilabad), కరీంనగర్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుందన్నారు. ఉత్తర తెలంగాణలో కీలకమైన కామారెడ్డి నుంచి ప్రయాణికులు ఇతర ప్రాంతాలకు సులభంగా వెళ్లేందుకు హైవే బస్టాండ్ అత్యవసరమని, వెంటనే చర్యలు చేపట్టాలని గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కోరారు.

ఇది కూడా చదవండి:NEET UG Cancelled | నీట్​ పరీక్ష రద్దు.. సంచలన నిర్ణయం తీసుకున్న ఎన్టీఏ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Illegal Sand Transport | అక్రమ ఇసుక రవాణాపై చీతా ఫోర్స్​ ఉక్కుపాదం.. రెండు భారీ లారీలు సీజ్​..

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Illegal Sand Transport | నిజామాబాద్ పోలీస్...

Google Server Error| షాకిచ్చిన గూగుల్.. ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన ‘సెర్చ్’ సేవలు

అక్షరటుడే వె‌బ్‌డెస్క్:Google Server Error|ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు అత్యధికంగా ఉపయోగించే...

JCD Prabhakar Politics | తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌గా జేసీడీ ప్రభాకర్

అక్షరటుడే వెబ్‌డెస్క్: JCD Prabhakar Politics | నటుడిగా ప్రజాదరణ పొంది,...

Hyundai New SUV | హ్యుందాయ్ నుంచి కొత్త కారు.. వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే!

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyundai New SUV | ఆటోమొబైల్ రంగ దిగ్గజ...