Free Sewing Machines | మహిళలకు గుడ్​న్యూస్​.. ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Free Sewing Machines | రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు గుడ్​ న్యూస్​ చెప్పింది. స్వయం ఉపాధి కల్పించడానికి ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేస్తామని ప్రకటించింది. త్వరలోనే వీటి కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Prabhakar)​ తెలిపారు.

బలహీన వర్గాల పక్షాన మహిళలకు స్వయం ఉపాధి కల్పించడానికి ప్రతి నియోజకవర్గానికి 1000 మంది బీసీ మహిళలకు (BC Wpmen) కుట్టు మిషన్లు ఇస్తామని మంత్రి తెలిపారు. త్వరలోనే వాటికి అప్లికేషన్ తీసుకొని జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి సూచన మేరకు మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగు పరచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెంచడంతోపాటు, స్కిల్ డెవలప్మెంట్ లాంటి కార్యక్రమాలు చేయడానికి చర్యలు చేపట్టామన్నారు.

Free Sewing Machines | పథకం అమలుపై సమీక్ష

ponnam 1

బీసీ మహిళలకు టైలరింగ్ ఆధారిత స్వయం ఉపాధి కల్పించి, వారి ఉత్పాదకతను పెంచి, టైలరింగ్ వ్యాపార అవకాశాలను విస్తరించుకునేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు మంత్రి పొన్నం తెలిపారు. ఆటోమేటిక్ కుట్టు యంత్రాలను ఉచితంగా అందిస్తామన్నారు. ఈ పథకం అమలుపై బీసీ సంక్షేమ శాఖ సెక్రెటరీ బాలమయాదేవి, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య బట్టు, ఇతర అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గానికి వెయ్యి మంది మహిళలకు కుట్టు మిషన్లు ఇస్తామని మంత్రి తెలిపారు.

 

దీనిని కూడా చదవండి : Spouse Transfer Issue | స్పౌస్ ఫ్యాక్టర్ అమలుపై గందరగోళం.. ఉద్యోగుల్లో ఆందోళన!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *