SI Suspended | అన్న అని పిలిచినందుకు దాడి చేసిన ఎస్సై.. సస్పెండ్​ చేసిన అధికారులు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : SI Suspended | అన్న అని పిలిచినందుకు నాయి బ్రాహ్మణుడిపై దాడి చేసిన ఎస్సైపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. అతడిని సస్పెండ్​ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

కరీంనగర్​ (Karimnagar) త్రీ టౌన్​ ఎస్సై చైతన్య చందర్ (SI Chaitanya Chander) శనివారం ఉదయం నగరంలోని ఖాన్‌‌పురా ప్రాంతంలోని న్యూ ప్రజా హెయిర్  స్టైల్  సెలూన్ ‌‌కు వెళ్లాడు. ఆయనను చూడగానే షాపు యజమాని అన్న కూర్చో అన్నాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఎస్సై అతడిపై దాడి చేశారు. తనను అన్న అని పిలుస్తావా అంటూ చేయి చేసుకున్నాడు. ఈ ఘటన సెలూన్​లోని సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఆ వీడియో సోషల్​ మీడియాలో వైరల్ అయింది. బాధితుడు ఎస్సైపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్​ అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఉంటే ఎవరినైనా కొడతారా అంటూ మండిపడ్డారు.

karim nagar

SI Suspended | సీపీ సీరియస్

ఎస్సై చైతన్య చందర్​ వ్యవహారం సీపీ గౌష్  ఆలం (CP Goush Alam) దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన విచారణకు ఆదేశించారు. సామాన్య పౌరుడిపై దాడి చేయడం, అధికార దుర్వినియోగానికి పాల్పడడం, విధి నిర్వహణలో అనుచితంగా ప్రవర్తించినట్లు విచారణలో తేలింది. దీంతో ఎస్సైపై సీపీ సీరియస్​ అయ్యారు. అనంతరం అతడిని సస్పెండ్​ చేశారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

దీనిని కూడా చదవండి : Telangana IAS Transfers | తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఒకేసారి భారీ స్థాయిలో ఐఏఎస్​ల బదిలీ!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *