Sand Mining Allegations | మంత్రుల ఇసుక దందా.. ​ కవిత సంచలన వ్యాఖ్యలు

సీఎం రేవంత్​రెడ్డి ఆధ్వర్యంలో ఇద్దరు మంత్రులు ఇసుక దందా చేస్తున్నారని టీఆర్​ఎస్​ అధ్యక్షురాలు కవిత ఆరోపించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Sand Mining Allegations | తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్​రెడ్డి ఆధ్వర్యంలో ఇద్దరు మంత్రులు ఇసుక దందా చేస్తున్నారని ఆరోపించారు.

సీతమ్మ సాగర్ మల్టీ పర్పస్ ప్రాజెక్టు ముంపు పేరుతో గోదావరి నదిని చెరబట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల మంత్రులు కుట్రలు చేస్తున్నారని కవిత ఆరోపించారు. ఆదివాసీల అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకొని ఇసుక క్వారీల పేరుతో గ్రామ సభలు నిర్వహించి 70 కి.మీ.ల పొడవునా గోదావరి నుంచి ఇసుక తవ్వి తీసి వేల కోట్ల రూపాయల దందాకు తెరతీశారన్నారు.

Sand Mining Allegations | సీఎం డైరెక్షన్​లో..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతమ్మ సాగర్ హెడ్ వర్క్స్ ఉంది. అక్కడి నుంచి 70 కి.మీ.ల దూరంలోని ములుగు జిల్లా మంగపేట మండలం రమణక్కపేట, వాడగూడెం, అకినపల్లి వరకు గోదావరి నది ముంపు పేరుతో మొత్తం ఇసుక దోచేందుకు యత్నిస్తున్నారని కవిత అన్నారు. దీంతో రూ.వేల కోట్లు కొల్లగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి డైరెక్షన్​లో ఇద్దరు మంత్రులు సాగిస్తున్న ఈ దందాను అడ్డుకునే వరకు తెలంగాణ రక్షణ సేన పోరాడుతుందని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి..: Olympics 2036 | ఒలింపిక్స్​ 2036లో పతకాలే లక్ష్యం : మంత్రి శ్రీహరి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *