Telangana Rain Alert | నేడు పలు జిల్లాలకు వర్ష సూచన

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Rain Alert | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం వర్షాలు పడే ఛాన్స్​ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం లభిస్తుందన్నారు.

తెలంగాణలో గత నాలుగు రోజులుగా అకాల వర్షాలు (Unseasonal Rains) కురుస్తున్న విషయం తెలిసిందే. రోజంతా భానుడు తన ప్రతాపం చూపుతుండగా.. సాయంత్రం వేళ వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. హీట్ వేవ్​ కారణంగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. అకాల వర్షాలు పడుతున్నా.. ఉక్కపోత మాత్రం తగ్గడం లేదు. అయితే సోమవారం రాత్రి పలు జిల్లాలో వాన దంచికొట్టింది. దీంతో వాతావరణం చల్లబడింది. బుధవారం సైతం వర్షాలు పడుతాయని, ఎండ తీవ్రత తక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు.

Telangana Rain Alert | ఈ జిల్లాల్లో..

తెలంగాణలోని వికారాబాద్ (Vikarabad), సంగారెడ్డి, రంగారెడ్డి, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ సాయంత్రం నుంచి రాత్రి వరకు వర్షం పడే అవకాశం ఉంది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఉదయం పూట చిరు జల్లులు కురిశాయి. మిగతా జిల్లాల్లో వాతావరణం పొడిగా ఉంటుంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్రత కొనసాగనుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

దీనిని కూడా చదవండి : ACB RTA Raids | ఆర్‌టీఏ కార్యాలయాల్లో ఏసీబీ మెరుపుదాడులు.. బట్టబయలైన బ్రోకర్ల దందా!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *