May 28 Gold Rates | అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం.. బంగారం, వెండి ధరల్లో మార్పులు

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 28 Gold Rates | అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న ఆర్థిక అనిశ్చితులు, యుద్ధ వాతావరణం, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల ప్రభావంతో బంగారం, వెండి ధరలు రోజురోజుకూ భారీగా మారుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపడంతో పసిడి ధరలు Gold Rates రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే బంగారం ధరలు దాదాపు 70 శాతం వరకు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక వెండి ధరలు మరింత వేగంగా పెరిగి 150 శాతం వరకు ఎగబాకాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే సామాన్యులు ధరలు తగ్గే సమయాన్ని ఎదురుచూస్తున్నారు.

బుధవారం భారీగా తగ్గిన బంగారం ధరలు గురువారం (మే 28) మాత్రం స్థిరంగా కొనసాగాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.15,828 వద్ద ఉండగా, 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.14,509గా ఉంది. 18 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.11,871 వద్ద కొనసాగుతోంది.

akshara today 1 5.jpggold 5

May 28 Gold Rates | ప్ర‌ధాన న‌గ‌రాల‌లో ధ‌ర‌లు ఇవే..

తులం ప్రకారం చూస్తే 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,58,280గా ఉంది. 22 క్యారెట్ల బంగారం తులం రూ.1,45,090 కాగా, 18 క్యారెట్ల బంగారం తులం రూ.1,18,710 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇదే ధరలు నమోదవుతున్నాయి.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.15,828గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ.14,509 వద్ద ఉంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. అమరావతి, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, ఖమ్మం, నిజామాబాద్ Nizamabad వంటి నగరాల్లో కూడా ధరల్లో పెద్దగా మార్పులు కనిపించలేదు.

May 28 Gold Rates | అధిక స్థాయిలోనే వెండి ధరలు

ఇక వెండి ధరలు కూడా అధిక స్థాయిలోనే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం వెండి గ్రాము ధర రూ.284.90గా ఉంది. తులం వెండి ధర రూ.2,849 కాగా, కిలో వెండి ధర రూ.2,84,900 వద్ద కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే కిలో వెండి ధర రూ.100 మేర తగ్గింది.

హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ.2,89,900 వద్ద ఉంది. చెన్నైలో కూడా ఇదే ధర కొనసాగుతుండగా, బెంగళూరులో Bangalore రూ.2,85,100, కోల్‌కతాలో రూ.2,84,900గా నమోదైంది.

భారతదేశంలో నగల తయారీలో ప్రధానంగా 22 క్యారెట్ల బంగారాన్నే ఉపయోగిస్తారు. ఇందులో రాగి, వెండి వంటి ఇతర లోహాలను కలపడం వల్ల నగలకు బలం వస్తుంది. 22 క్యారెట్ల బంగారం సాధారణంగా 916 హాల్‌మార్క్ స్వచ్ఛతతో ఉంటుంది.

అందుకే ఎక్కువ మంది కొనుగోలుదారులు ఈ రేట్లపైనే దృష్టి పెడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల మార్పులకు డాలర్ మారకపు విలువ కూడా ప్రధాన కారణంగా మారుతోంది.

DK Shivakumar Biography | ట్రబుల్​ షూటర్​.. కాంగ్రెస్​ పార్టీకి తిరుగులేని…

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *