అక్షరటుడే, రాజన్న సిరిసిల్ల : Indiramma Family Life Insurance | ఇందిరమ్మ కుటుంబ జీవితబీమా పథకాన్ని సీఎం ప్రారంభించే సమయంలోనే అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్లో కలెక్టర్ గరిమ అగ్రవాల్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
Indiramma Family Life Insurance | సిద్దిపేటలో..
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈ నెల 19వ తేదీన సిద్దిపేట జిల్లా నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారని తెలిపారు. ప్రతి కుటుంబానికి బీమా భద్రత కల్పించనున్న నేపథ్యంలో ప్రతి కుటుంబం నుంచి దరఖాస్తులు సేకరించాలని సూచించారు. గ్రామాలు, మున్సిపల్ వార్డుల వారీగా ప్రత్యేక శిబిరాలు నిర్వహించి, దరఖాస్తుల సేకరణ చేపట్టాలని ఆదేశించారు. ప్రతి కుటుంబానికి సంబంధించిన దరఖాస్తు ఫారాన్ని సేకరించాలని, అందులో బీమా పొందే వ్యక్తి వివరాలు, నామినీ వివరాలు స్పష్టంగా నమోదు చేయించాలని తెలిపారు.
Indiramma Family Life Insurance | పథకంపై విస్తృత ప్రచారం కల్పించాలి
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఉద్దేశం, ప్రయోజనాలు, దరఖాస్తు విధానం, తదితర అంశాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సంజయ్ జాజు సూచించారు. గ్రామాల్లో మైక్ ప్రచారం, పోస్టర్లు, కరపత్రాలు, ప్రజా సమావేశాలు, మీడియా ద్వారా పథకం వివరాలను ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించి, దరఖాస్తుల సేకరణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో లక్ష్మీనారాయణ, జిల్లా పంచాయతీ అధికారి వీర భద్రయ్య, జిల్లా ప్రణాళిక అధికారి సంపత్ కుమార్, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, లోకేష్, ఈడీఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Khelo India Youth Games | 11వ తేదీ నుంచి ఖేలో ఇండియా పోటీలు..: కలెక్టర్ గరిమ అగ్రవాల్