BJP Chief Letter | సీఎం రేవంత్‌కు బీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు లేఖ

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : BJP Chief Letter | ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) కి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​రావు లేఖ రాశారు. తెలంగాణకు కేటాయించిన గోదావరి జలాల వినియోగంపై ఆయన లేఖలో ప్రస్తావించారు.

గోదావరి జలాలను తెలంగాణ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడం లేదని రాంచందర్​రావు పేర్కొన్నారు. గోదావరి నదిపై 360 టీఎంసీల ప్రాజెక్టులకు.. కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని గుర్తు చేశారు. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణపై నిర్లక్ష్యంచేశారని విమర్శించారు. దీంతో 200 టీఎంసీలు నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని అనుమతులు వచ్చినా సీతారామసాగర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పూర్తి చేయడంలేదని మండిపడ్డారు. సమ్మక్క-సారక్క ప్రాజెక్ట్‌లోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు.

BJP Chief Letter | బీఆర్​ఎస్​ హయాంలో..

కాళేశ్వరం ప్రాజెక్టు విషయానికి వస్తే, గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల అనే మూడు బ్యారేజీల రూపకల్పనలో లోపాలు, నిర్మాణంలో అసమర్థత కారణంగా 2023 సంవత్సరంలో వాటి నిర్మాణం తీవ్రంగా దెబ్బతిందన్నారు. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే, మీ పాలనలోని చివరి రెండున్నర సంవత్సరాలలో, జాతీయ డ్యామ్ భద్రతా అథారిటీ (NDSA) పలు నివేదికలను ఇచ్చిందన్నారు. అయినా బ్యారేజీల పునరుద్ధరణ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.

దీనిని కూడా చదవండి : Caste Names Change | ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ కులాల పేర్లు మార్పు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *