CI Bribery Case | ప్రతి నెలా రూ.50 వేల మామూళ్లు ఇవ్వాల్సిందే.. లంచం తీసుకుంటూ దొరికిన సీఐ

హైదరాబాద్​ నగరంలోని టోలిచౌకి సీఐ ఎల్​ రమేశ్​ నాయక్​ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: CI Bribery Case | రాష్ట్రంలో అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. ప్రజలు, వ్యాపారులు, కాంట్రాక్టర్ల నుంచి భారీగా డబ్బులు డిమాండ్​ చేస్తున్నారు. పైసలు ఇస్తేనే పనులు చేస్తున్నారు. లేదంటే వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ సీఐ హోటల్ నిర్వాహకుల నుంచి ప్రతి నెలా రూ.50 వేల లంచం డిమాండ్​ చేశాడు. అతడిని ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

హైదరాబాద్​ (Hyderabad) నగరంలోని టోలిచౌకి సీఐ ఎల్​ రమేశ్​ నాయక్​ను ఏసీబీ అధికారులు బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో పట్టుకున్నారు. ఈ మేరకు గురువారం ఉదయం వివరాలు వెల్లడించారు. సీఐ రమేశ్​ ఓ హోటల్ యాజమాన్యాన్ని లంచం డిమాండ్​ చేశాడు. రాత్రి ఒంటి గంట వరకు నడుపుకోవడానికి ఎలాంటి ఇబ్బంది పెట్టొద్దు అంటే ప్రతి నెలా రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్​ చేశాడు.

CI Bribery Case | రూ.20 వేలు తీసుకుంటుండగా..

సీఐ రమేశ్​ నాయక్​ మొదటి నెలా రూ.40 వేలు తీసుకొవడానికి ఒప్పుకున్నాడు. అనంతరం ప్రతి నెలా రూ.50 వేలు ఇవ్వాలని చెప్పాడు. ఈ మేరకు అక్టోబర్​ 31న రూ.20 వేల లంచం తీసుకున్నాడు. మిగతా రూ.20 వేలు బుధవారం రాత్రి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. అనంతరం అతడి వద్ద తనిఖీలు చేపట్టి లెక్కల్లో చూపని రూ.1.80 లక్షల నగదును గుర్తించారు. ఆ డబ్బులను స్వాధీనం చేసుకొని సీఐని అరెస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి..: Telangana Fancy Number Rules | వాహనదారులకు అలర్ట్.. ఫ్యాన్సీ నంబర్ల గడువు 30 రోజులకు తగ్గింపు..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *