అక్షరటుడే వెబ్‌డెస్క్: Telangana Fancy Number Rules | వాహనదారులకు తెలంగాణ ( Telangana )ప్రభుత్వం కీలక నిర్ణయం వెల్లడించింది. ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ల కేటాయింపునకు సంబంధించి గతంలో ఉన్న గడువును భారీగా తగ్గించింది. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనలు నవంబర్ 19, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి.
Telangana Fancy Number Rules | 30 రోజుల్లోపు ప్రక్రియ ..
కొత్త నిబంధనల ప్రకారం.. వాహన యజమానులు తమకు నచ్చిన ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను పొందాలంటే, తాత్కాలిక రిజిస్ట్రేషన్ (TR) జారీ అయిన తేదీ నుంచి కేవలం 30 రోజుల్లోపు మాత్రమే అన్ని ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉంటుంది. గతంలో ఈ గడువు 60 రోజులుగా ఉండేది. ఫ్యాన్సీ నంబర్ కోరుకునేవారు రిజర్వేషన్, ఆన్లైన్ బిడ్డింగ్, చెల్లింపుల వంటి ప్రక్రియలన్నింటినీ నిర్ణీత 30 రోజుల వ్యవధిలోనే ముగించుకోవాలని రవాణా శాఖ స్పష్టం చేసింది.
Telangana Fancy Number Rules | రాండమ్ నంబరే ఆధారం..
వాహన యజమానులు నిర్దేశిత 30 రోజుల్లోపు ఫ్యాన్సీ నంబర్ ప్రక్రియను పూర్తి చేయడంలో విఫలమైతే, ఆ వెహికల్‌కు ఆటోమేటిక్‌గా రాండమ్ రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయిస్తామని ప్రభుత్వం తేల్చిచెప్పింది. కాబట్టి ఫ్యాన్సీ నంబర్లపై ఆసక్తి ఉన్నవారు ఈ గడువును ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలని సూచించారు.
అలాగే, కొత్తగా వాహనాలు విక్రయించే సమయంలోనే ఈ కొత్త నిబంధనల గురించి కస్టమర్లకు ముందే స్పష్టంగా తెలియజేయాలని రాష్ట్రంలోని ఆటోమొబైల్ డీలర్లను రవాణా శాఖ కోరింది. ఈ మార్పులకు సంబంధించి మరింత సమాచారం కోసం సమీపంలోని ఆర్టీఏ (RTA) కార్యాలయాన్ని సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Pension Criticism | పింఛన్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేస్తోంది: మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి