Fog Driving Safety | పొగమంచులో వాహనదారులు జాగ్రత్తగా వాహనాలు నడపాలి..: సీపీ సాయిచైతన్య

శీతాకాలం నేపథ్యంలో రహదారులపై దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశం ఉన్నందున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Fog Driving Safety | శీతాకాలం నేపథ్యంలో రహదారులపై దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశం ఉన్నందున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సీపీ సాయిచైతన్య (CP Saichaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు.

Fog Driving Safety | అత్యవసర పరిస్థితుల్లోనే ప్రయాణాలు..

అత్యవసర పరిస్థితులు మినహా పొగమంచు సమయంలో ప్రయాణాలు చేయకుండా వాయిదా వేసుకోవాలన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తే తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ముఖ్యంగా తెల్లవారుజామున నుంచి ఉదయం 8 గంటల వరకు పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. పొగమంచు సమయంలో వాహనాల లైట్లు వెలిగించినప్పటికీ ఎదురుగా ఉన్న వాహనాలు స్పష్టంగా కనిపించకపోవచ్చని ఆయన తెలిపారు. అకస్మాత్తుగా బ్రేకులు వేయడం వల్ల వాహనాలు అదుపుతప్పడం , బోల్తా పడటం , ముందు వెళ్తున్న వాహనాలను ఢీకొట్టడం వంటి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందన్నారు. కాబట్టి వాహనదారులు వేగాన్ని తగ్గించి, ముందు వెళ్తున్న వాహనానికి తగినంత దూరం పాటిస్తూ ప్రయాణించాలని సూచించారు.

ఇది కూడా చదవండి: చంద్రబాబు ఇచ్చిన లెటర్ వల్లే… 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *