అక్షరటుడే, కామారెడ్డి: Rajampet SI ACB Trap | ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ అధికారి అడ్డదారి తొక్కాడు. లంచం తీసుకుంటూ ఏసీబీకి (ACB Trap) రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అనిశా అధికారులు గురువారం మధ్యాహ్నం కామారెడ్డి పట్టణంలో ఆయనను పట్టుకున్నారు.
Rajampet SI ACB Trap |కామారెడ్డి పట్టణంలో..
రాజంపేట మండలానికి చెందిన ఓ వ్యక్తి,.. ఓ కేసు విషయంలో స్టేషన్ బెయిల్ నిమిత్తం రాజంపేట ఎస్సై ఆంజనేయులును ఆశ్రయించాడు. అయితే సదరు ఎస్సై పని చేసిపెడతానంటూ రూ.లక్ష డిమాండ్ (Bribery Case) చేశాడు. చివరికి రూ.50వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో బాధితుడు గతంలో రూ.20వేలు ముట్టజెప్పాడు. మిగతా రూ.30వేలు ఇచ్చే క్రమంలో ఏసీబీని ఆశ్రయించాడు. పథకం ప్రకారం కామారెడ్డిలోని (Kamareddy) ఎస్సై నివాసంలో బాధితుడి నుంచి ఎస్సై రూ.30 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ప్రస్తుతం అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జిల్లా ఎస్పీగా రాజేష్ చంద్ర బాధ్యతలు చేపట్టిన తర్వాత పోలీస్ స్టేషన్లలో క్రమశిక్షణ పెరిగిందని, చిన్న పొరపాటు జరిగినా వెంటనే సమాచారం చేరుతోందని చెబుతున్నారు. అయినప్పటికీ ఓ ఎస్సై లంచం తీసుకుంటూ పట్టుబడటంతో పోలీస్ శాఖలో కలకలం రేగుతోంది. ఇలాంటి ఘటనలు పోలీస్ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.