Aadhaar Cards | ఒక విద్యార్థికి రెండు ఆధార్ కార్డులు.. అగమ్యగోచరంలో విద్యార్థి చదువు

ఒక విద్యార్థికి రెండు ఆధార్ కార్డులు ఇవ్వడంతో ఆ విద్యార్థి చదువు ప్రస్తుతం అగమ్య గోచరంగా మారింది.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Aadhaar Cards | ఒక విద్యార్థికి రెండు ఆధార్ కార్డులు ఇవ్వడంతో ఆ విద్యార్థి చదువు ప్రస్తుతం అగమ్య గోచరంగా మారింది. ఈ ఘటన నగరంలోని(Nizamabad ) ఆధార్ సెంటర్​లో (Aadhaar Card) చోటుచేసుకుంది.

Aadhaar Cards | రాజీవ్ గాంధీ ఆడిటోరియం వద్ద..

బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. మాక్లూర్ మండలం గంగరమంద గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన కొడుకు ఆధార్ కార్డు అప్డేట్ నిమిత్తం నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలోని ఆధార్ సెంటర్​కు వచ్చాడు. అయితే ఆధార్ సెంటర్లోని నిర్వాహకులు పాత ఆధార్ కార్డును చూసి ఇది ఆన్​లైన్​లో కనిపించడం లేదని కొత్త ఆధార్ కార్డు తీసుకోవాలని పేర్కొన్నారు. నివాస ధృవపత్రం తీసుకొస్తే కొత్త ఆధార్ కార్డు తీద్దామని పేర్కొనడంతో బాధితుడు నివాస ధృవపత్రంతో ఆధార్​ కేంద్రాన్ని సంప్రదించాడు. వారు నాల్గో తరగతి చదువుతున్న విద్యార్థి పేరిట మరో కొత్త ఆధార్ కార్డు తీశారు. అయితే కొత్త ఆధార్ కార్డుతో పాఠశాలకు వెళ్లిన విద్యార్థి తండ్రికి చుక్కెదురైంది. ఆన్​లైన్​లో సదరు విద్యార్థికి సంబంధించిన ఆధార్ వివరాలు కనిపించకపోవడంతో పాఠశాల నిర్వాహకులు మళ్లీ మొదటి నుంచి చదువుకోవాలని సూచించారని బాధితుడు తెలిపాడు. నాలుగేళ్ల చదువును పక్కకు పెట్టి మళ్లీ మొదటి నుంచి చదవాలని చెప్పడంతో ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో తిరగి నగరంలోని ఆధార్​ సెంటర్​ను ఆశ్రయించాడు.

ఇది కూడా చదవండి: పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు : పీసీసీ చీఫ్​ 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *