AI Job Threat | ఏఐతో వైట్​ కాలర్​ ఉద్యోగాలు పోతాయి.. స్కిల్స్​ నేర్చుకోవాలి : సీఎం రేవంత్​రెడ్డి

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : AI Job Threat | సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం చదువులతో ఉద్యోగాలు రావన్నారు. గతంతో సాఫ్ట్​వేర్​ ఉద్యోగాలకు డిమాండ్​ ఉండేదని ఏఐ వాటి స్థానాన్ని భర్తీ చేస్తుందన్నారు. వైట్​ కాలర్​ జాబ్స్ (White-collar jobs)​కు ఏఐతో ముప్పు ఉందన్నారు. భవిష్యత్​లో బ్లూ కాలర్​ జాబ్​లకు డిమాండ్​ ఉంటుందని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ (Hyderabad)​ నాంపల్లిలోని హజ్​ హౌజ్ (Hajj House)​కు వచ్చారు. హజ్​కు వెళ్తున్న యాత్రికుల బస్సును జెండా ఊపి ప్రారంభించారు. 430 మంది యాత్రికులతో 8వ విమానం నేడు బయలు దేరనుంది. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ.. ఇంజినీర్​, డాక్టర్​ చదివితే ఉద్యోగాలు వస్తాయో రావో తెలియదన్నారు. అందుకే యువత నైపుణ్యాలు నేర్చుకోవాలని సూచించారు. ముస్లిం యువత ఆచరణాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడంపై దృష్టి పెట్టాలన్నారు.

AI Job Threat | ఏటీసీల్లో చేర్చాలి

ప్రస్తుతం స్కిల్​డ్​ లేబర్​కు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్​ ఉందని సీఎం అన్నారు. ఆ డిమాండ్​ మేరకు రాష్ట్రంలో ఐటీఐలను ఏటీసీలు (ATC)గా అప్​గ్రేడ్​ చేసి నూతన కోర్సులను ప్రవేశ పెట్టామన్నారు. ఇందులో చేరే విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి నెలకు రూ.రెండు వేల స్కాలర్​షిప్​ ఇస్తామని తెలిపారు.

AI Job Threat | బీజేపీని అడ్డుకున్నాం

కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలలో బీజేపీని తాము అడ్డుకున్నామని సీఎం పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడును వాడుకుంటూ, వారు ఆంధ్రప్రదేశ్‌లో పాగా వేశారన్నారు. ‘‘పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్‌లలో ఏం జరిగిందో మనం చూశాము. తెలంగాణలో అది పునరావృతం కాకూడదు” అన్నారు. వారు హైదరాబాద్ నగరాన్ని కైవసం చేసుకోవాలని చూస్తున్నారని, అటువంటి శక్తులను తప్పక అడ్డుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అసదుద్దీన్​ ఒవైసీ, మంత్రి అజారుద్దీన్‌, షబ్బీర్‌ అలీ, MLA జాఫర్‌ తదితరులు పాల్గొన్నారు.

 

దీనిని కూడా చదవండి : Telangana Law Order| హోంమంత్రిగా రేవంత్ రెడ్డి ఫెయిల్.. అందుకే రాష్ట్రంలో ఈ దారుణాలు: కేటీఆర్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *