AP Govt DA | ఉద్యోగులు, పింఛనుదారులకు రెండు డీఏలు.. బకాయిల చెల్లింపునకు షెడ్యూల్

ఈ డీఏకు సంబంధించిన 26 నెలల బకాయిలను 2027 ఏప్రిల్, జూన్, ఆగస్టు, అక్టోబర్ నెలల్లో నాలుగు విడతలుగా చెల్లించనున్నారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: AP Govt DA | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. రెండు విడతలకు సంబంధించిన కరవు భత్యం (డీఏ) విడుదలకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన డీఏను సెప్టెంబరు నెల జీతంతో కలిపి చెల్లించేలా ఆదేశాలు జారీ చేసింది.

AP Govt DA | బకాయిలు విడతల వారీగా జమ..

2025 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చే 1.82 శాతం డీఏను ఉద్యోగులకు చెల్లించనుంది. ఈ కాలానికి సంబంధించిన బకాయిలను ఒకేసారి కాకుండా విడతల వారీగా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 20 నెలల బకాయిలను 2028 జనవరి, మార్చి, మే, జులై నెలల్లో జమ చేయనుంది.

అదేవిధంగా 2024 జులై 1 నుంచి అమల్లోకి వచ్చే 2.73 శాతం డీఏను కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ డీఏకు సంబంధించిన 26 నెలల బకాయిలను 2027 ఏప్రిల్, జూన్, ఆగస్టు, అక్టోబర్ నెలల్లో నాలుగు విడతలుగా చెల్లించనున్నారు.

AP Govt DA | పింఛనుదారులకు ఎలా అంటే..

ఉద్యోగులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పింఛనుదారులకు కూడా ఇదే విధానంలో డీఏ బకాయిలను చెల్లించాలని ఆర్థిక శాఖ ఆదేశించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొంది.

Bhakta Ramadasu Descendant | భక్త రామదాసు వంశీకుడి తిరుమల దర్శనం.. రామభక్తి నుంచి గోవింద నామస్మరణ వరకు అపూర్వ ఆధ్యాత్మిక అనుభూతి

డీఏ పెంపుతో ఉద్యోగులు, పింఛనుదారుల నెలవారీ ఆదాయంలో స్వల్పంగా పెరుగుదల కనిపించనుంది. అయితే గత కాలానికి సంబంధించిన బకాయిలను ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం విడతలవారీగా అందుకోనున్నారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *