December Darshan Quota | శ్రీవారి భక్తులకు అలర్ట్.. డిసెంబర్ దర్శన కోటా విడుదల వివరాలు

తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల డిసెంబర్​ కోటాను ఈ నెల 19న టీటీడీ విడుదల చేయనుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: December Darshan Quota | తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకునే భక్తులకు టీటీడీ కీలక వార్త చెప్పింది. డిసెంబర్​ నెలకు సంబంధించి దర్శన కోటా ఆన్​లైన్​ బుకింగ్ వివరాలను తాజాగా వెల్లడించింది.

శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన డిసెంబర్​ కోటాను సెప్టెంబర్ 19న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను 22న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వెబ్​సైట్​లో పెట్టనుంది.

December Darshan Quota | అంగ ప్రదక్షిణ టోకెన్లు

అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను ఈ నెల 23న ఉదయం 11 గంటలకు, వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను అదే రోజు మధ్యాహ్నం 3 గంట‌ల‌కు విడుద‌ల చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు, తిరుమల, తిరుపతిల‌లో గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో రిలీజ్ ​చేస్తారు.

ఇది కూడా చదవండి..: AP Govt DA | ఉద్యోగులు, పింఛనుదారులకు రెండు డీఏలు.. బకాయిల చెల్లింపునకు షెడ్యూల్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *