Kamareddy Power Cuts | కర్షకుల కన్నెర్ర.. కరెంట్ కోతలపై ట్రాన్స్​కో ఎస్ఈ ఆఫీస్​ ముట్టడి

వ్యవసాయానికి 18 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే,కామారెడ్డి :  Kamareddy Power Cuts | వ్యవసాయానికి 18 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ కిసాన్ ఆధ్వర్యంలో రైతులు ఆదోళన చేశారు. ఈ మేరకు శనివారం కామారెడ్డి (Kamareddy) విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.

Kamareddy Power Cuts | రైతే రాజు అనేది మాటలకే..

రైతే రాజు అనేది మాటలకే పరిమితమైందని, క్షేత్రస్థాయిలో ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంట్ కోతలకు నిరసనగా ప్రధాన రహదారిపై ఒకవైపు దిగ్బంధించారు. రైతుల ఆందోళన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. కిసాన్ సంఘ్ నాయకులు, రైతులు మాట్లాడుతూ.. ప్రస్తుతం అరకొర విద్యుత్ సరఫరాతో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు.

గంటకోసారి ట్రిప్ అవుతుండటం, తీవ్ర లో-వోల్టేజీ సమస్యతో మోటార్లు కాలిపోతున్నాయని వాపోయారు. 5 నుంచి 6 గంటలు కూడా సరిగా కరెంట్ రావడం లేదని, దీంతో పెట్టిన పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నను ప్రభుత్వం ఆదుకోవాలని, కరెంట్ కోతల వల్ల పంట నష్టం జరిగితే ప్రభుత్వమే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి..: ABVP Leaders Arrested | ఏబీవీపీ నాయకుల ముందస్తు అరెస్ట్​

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *