Mock Assembly | తెలంగాణ భవన్‌లో మాక్ అసెంబ్లీ

బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు మాక్ అసెంబ్లీ నిర్వహించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Mock Assembly | బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు మాక్ అసెంబ్లీ నిర్వహించారు. తమను అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్​ చేయడంతో తెలంగాణ భవన్​ (Telangana Bhavan) వేదికగా శనివారం మాక్​ అసెంబ్లీ నిర్వహించారు.

సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సీఎంగా, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు స్పీకర్‌గా వ్యవహరించారు. మంత్రులుగా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడారు.

Mock Assembly | కాంగ్రెస్​ పాలనపై విమర్శలు

మాక్ అసెంబ్లీలో కాంగ్రెస్​ పాలనపై సెటైర్లు వేశారు. సీఎంగా వ్యవహరించిన తలసాని మాట్లాడుతూ.. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పాము కానీ ఏ 100 రోజులో చెప్పామా అన్నారు. ఢిల్లీ వాళ్ళతో మాకుండే ఇబ్బందులు మాకు ఉన్నాయన్నారు. కాళేశ్వరం కట్టింది ఇందిరాగాంధీ అని పేర్కొన్నారు. ఉత్తమ్​ కుమార్​ రెడ్డిగా వ్యవహరించిన పల్లా మాట్లాడుతూ.. కేసీఆర్‌ నీటి ప్రవాహం కాదు.. మా ముఖ్యమంత్రి గారి బూతుల ప్రవాహం అన్నారు. మేడిగడ్డను రిపేర్ చేయండి అంటున్నారు.. మేమెందుకు చేస్తామని పేర్కొన్నారు. మేడిగడ్డను రిపేర్ చేస్తే కేసీఆర్‌కు పేరు వస్తుందని వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చదవండి..: Revanth Reddy Education | అందుకోసమే విద్యాశాఖను నా వద్ద ఉంచుకున్నా.. సీఎం రేవంత్ రెడ్డి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *