Telangana Heavy Rain | రాష్ట్రానికి నేడు భారీ వర్ష సూచన

రాష్ట్రంలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Heavy Rain | రాష్ట్రంలో శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం వరకు తేమతో కూడిన వేడి వాతావరణం కొనసాగుతోంది.

సాయంత్రం తర్వాత రాష్ట్రం (Telangana)లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్​ ఉంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయి. హైదరాబాద్​ నగరంలో మోస్తరు జల్లులు కురుస్తాయి.

Telangana Heavy Rain | అర్ధరాత్రి దంచికొట్టిన వాన

రాష్ట్రవ్యాప్తంగా గురువారం రాత్రి విస్తారంగా వర్షాలు కురిశాయి. సాయంత్రం నుంచి అక్కడక్కడ జల్లులు కురిశాయి. రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజామున భారీ వర్షం పడింది. ఈ వర్షాలు రైతులకు ఎంతో మేలు చేశాయి. ప్రస్తుతం పంటలు ఈనిక దశలో ఉన్నాయి. ఈ సమయంలో నీరు ఎంతో అవసరం. అయితే ఇటీవల ఎండలు పెరగడం, విద్యుత్​ కోతలతో నీరు అందక పొలాలు ఎండిపోతున్నాయి. ఈ సమయంలో వర్షాలు పంటలకు ఊపిరి పోశాయని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు అత్యధికంగా మెదక్​ జిల్లా కొల్చారంలో 129.5 మి.మీ వర్షపాతం నమోదు అయింది. సిద్దిపేట జిల్లా మార్కూక్​లో 114 మి.మీ వర్షం పడింది.

ఇది కూడా చదవండి..: Nizamabad RI Suicide | నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో విషాదం..సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆర్ఐ సతీష్ ఆత్మహత్య!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *