Delhi Police | ఢిల్లీలో దారుణం.. బాలికపై గ్యాంగ్​రేప్​

ఢిల్లీలో 17 ఏళ్ల బాలికపై ముగ్గురు మైనర్లతో సహా నలుగురు హత్యాచారం చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Delhi Police | ఢిల్లీ (Delhi)లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ 17 ఏళ్ల బాలికపై ముగ్గురు మైనర్లతో సహా నలుగురు సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను దారుణంగా హత్య చేసి ఖాళీ స్థలంలో పడేశారు.

ఢిల్లీ పోలీసులు ఈ నెల 13న వాయువ్య ఢిల్లీలోని కుషక్ రోడ్, స్వరూప్ నగర్ ప్రాంతంలో ఉన్న జైపాల్ రాణా పొలం సమీపంలో కుళ్లిన స్థితిలో బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఖాళీ స్థలంలో పడి ఉన్న మృతదేహం శరీర భాగాలను కుక్కలు తినేశాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాలికపై అత్యాచారం చేసి కత్తులతో పొడిచి చంపినట్లు గుర్తించారు. బాలికకు నిందితులతో ముందే పరిచయం ఉందన్నారు. ఘటన జరిగిన సమయంలో ఆమె వారితో కలిసి ఒక టెంపోలో ప్రయాణించిందని పేర్కొన్నారు.

Delhi Police | నిందితుల అరెస్ట్​

బాలిక కనిపించకుండా పోయినా.. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఆమె తరచూ ఇంటి నుంచి బయటకు వెళ్లి కొన్ని రోజుల తర్వాత వచ్చేదని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించారు. ఈ అఘాయిత్యానికి పాల్పడిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఖడ్డా కాలనీకి చెందిన శివం అలియాస్ సుదామ అలియాస్ చుచుతో పాటు ముగ్గురు మైనర్లు ఈ నేరానికి పాల్పడినట్లు వెల్లడించారు.

ఇది కూడా చదవండి..: CBSE Three Language Policy | త్రిభాషా విధానం పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *