GST Officer Bribery | రూ.8 లక్షల లంచం తీసుకుంటూ చిక్కిన జీఎస్టీ అధికారి

సెంట్రల్ జీఎస్‌టీ సూపరింటెండెంట్ రూ. 8 లక్షల లంచం తీసుకుంటూ దొరికాడు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: GST Officer Bribery | దేశంలో అవినీతి రాజ్యం ఏలుతోంది. గ్రామీణ స్థాయి నుంచి మొదలు పెడితే అత్యన్నత స్థాయి అధికారుల వరకు లంచాలు తీసుకుంటున్నారు. పైసలు ఇస్తేనే పనులు చేస్తున్నారు. ఏసీబీ, సీబీఐ, విజిలెన్స్​ బృందాలు సోదాలు, అరెస్టులు చేస్తున్నా.. లంచాలకు మరిగిన అధికారులు భయపడటం లేదు. తాజాగా ఓ అధికారి రూ.8 లక్షల లంచం తీసుకుంటూ.. కెమెరాకు చిక్కాడు.

బెంగళూరు (Bangalore)లోకాయుక్త చేపట్టిన ఒక ఆపరేషన్‌లో సెంట్రల్ జీఎస్‌టీ (GST) సూపరింటెండెంట్ రూ. 8 లక్షల లంచం తీసుకుంటూ దొరికాడు. నిందితుడిని సౌత్ కమిషనరేట్ పరిధిలోని సౌత్ డివిజన్-4కు చెందిన జీఎస్‌టీ సూపరింటెండెంట్ మోహిత్ ప్రతాప్ సింగ్‌గా గుర్తించారు. పెండింగ్​లో ఉన్న జీఎస్టీ బకాయిలుపై తప్పుడు ఫిర్యాదును మూసి వేయడానికి ఓ వ్యాపారిని సదరు అధికారి లంచం అడిగాడు.

GST Officer Bribery | వల పన్ని..

సదరు వ్యాపారి సయ్యద్ జమీర్ దీనిపై లోకాయుక్తాను ఆశ్రయించాడు. లోకాయుక్త అధికారులు ఒక వల పన్ని, మధ్యవర్తి ద్వారా డబ్బు తీసుకుంటుండగా మోహిత్ ప్రతాప్ సింగ్​ను పట్టుకున్నారు. ఈ లావాదేవీలో సల్మాన్ షేక్ అనే వ్యక్తి దళారీగా వ్యవహరించాడు. అతడిపై కూడా కేసు నమోదు చేశామని అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి..: Delhi Police | ఢిల్లీలో దారుణం.. బాలికపై గ్యాంగ్​రేప్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *