West Bengal Polling 2 | బెంగాల్​లో రెండో విడత పోలింగ్​ ప్రారంభం

Naresh Chandan
West Bengal Polling 2

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: West Bengal Polling | పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌ తాజాగా ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఓటింగ్‌ కొనసాగనుంది.

West Bengal Polling 2 | 142 స్థానాలకు పోలింగ్​..

రెండో దశలో కలకత్తా, హుగ్లీ, హౌడా, ఉత్తర, దక్షిణ 24 పరగణా తదితర జిల్లాల్లోని 142 స్థానాలకు పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. రెండో దశ ఓటింగ్‌ కోసం ఆయా జిల్లాల్లో 41 వేలకుపైగా పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

 ముందస్తు అరెస్టులు..

పోలింగ్‌ కేంద్రాల నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా ప్రత్యక్ష నిఘా కొనసాగుతోంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని హింసాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. అనుమానం ఉన్నవారిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. మే 4న పశ్చిమ బెంగాల్‌తోపాటు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అసోం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Upasana Konidela | పాశ్చాత్యం వద్దు.. భారతీయ సంప్రదాయమే ముద్దు.. టాయిలెట్ వినియోగంపై ఉపాసన ప్రచారం!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *