Upasana Konidela | పాశ్చాత్యం వద్దు.. భారతీయ సంప్రదాయమే ముద్దు.. టాయిలెట్ వినియోగంపై ఉపాసన ప్రచారం!

Naresh Chandan
Upasana Konidela

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Upasana Konidela | ప్రముఖ టాలీవుడ్​ Tollywood నటుడు రామ్​చరణ్ Ramcharan​ సతీమణి, ప్రముఖ వ్యాపారవేత్త, ఆరోగ్య రంగంలో చురుకైన పాత్ర పోషిస్తున్న ఉపాసన కొణిదెల ఆరోగ్యం అవగాహనపై దృష్టి సారించారు. ఆధునిక జీవనశైలిలో మనం అలవాటు చేసుకున్న పాశ్చాత్య టాయిలెట్ విధానానికి స్వస్తి పలికి, సంప్రదాయ భారతీయ టాయిలెట్ విధానాన్ని అనుసరించాలని ఉపాసన సూచిస్తున్నారు.

Untitled 2.jpgupasana scaled

Upasana Konidela | ఆరోగ్యకర జీవనశైలిని ప్రోత్సహిస్తూ..

Apollo Hospitals కుటుంబానికి చెందిన ఉపాసన, “అపోలో లైఫ్” వంటి వేదికల ద్వారా ఆరోగ్యకర జీవనశైలిని ప్రోత్సహిస్తూ వస్తున్నారు. తాజాగా ఆమె షేర్ చేసిన సందేశం నెట్టింట వైరల్​ అవుతోంది. స్క్వాట్ (కూర్చునే) విధానంలోనే టాయిలెట్ ఉపయోగించడం ద్వారా శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలిగిస్తుందని తాజా సందేశం ద్వారా ఆమె అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.

upasana

Upasana Konidela | జీర్ణక్రియ మెరుగు..

వైద్య నిపుణులు చెబుతున్నట్టు.. సంప్రదాయ టాయిలెట్ విధానం వల్ల కడుపు మీద సరైన రీతిలో ఒత్తిడి పడుతుంది. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా, మల విసర్జన సులభంగా పూర్తవుతుంది. దీనికితోడు piles (పైల్స్) వంటి సమస్యలు వచ్చే అవకాశాన్ని తగ్గించవచ్చు.

శరీర శుభ్రత విషయంలోనూ సరైన పద్ధతిని అనుసరించడం ముఖ్యమని ఉపాసన హైలైట్ చేశారు. సంప్రదాయ విధానంలో ముందువైపు నుంచి శుభ్రం చేసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆమె పేర్కొన్నారు.

వేల కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా ఆరోగ్య అవగాహన కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు సరైన జీవనశైలిపై దారి చూపుతున్న ఉపాసన కొణిదెల అవగాహన కార్యక్రమాలు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Tim Cook Resignation | యాపిల్​ సీఈవో టిమ్ కుక్ తన బాధ్యతలకు గుడ్​బై.. కొత్త సారథిగా జాన్​ టెర్నస్​!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *