అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ration eKYC Deadline | రేషన్‌కార్డు లబ్ధిదారులు ఈ-కేవైసీ పూర్తి చేసేందుకు ఉన్న గడువును తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వం మరో నెల రోజులు పొడిగించింది. ఇవాళే ఆఖరి రోజు కావడంతో, ఈ గడువును ఆగస్టు 31 వరకు పొడిగిస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ ప్రకటించింది.
గడువులోగా ఈ-కేవైసీ పూర్తి చేయకుంటే నిత్యావసర సరకులు అందవని అధికారులు స్పష్టం చేస్తుండడంతో కార్డుదారులు కొద్దిగా ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తాజా నిర్ణయం లబ్ధిదారులకు ఎంతో ఊరటనిచ్చింది. అలాగే, ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు మూడు నెలల రేషన్‌ను ఒకేసారి పంపిణీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి..: Formula E Case | ఫార్ములా-ఈ కేసు.. నాంపల్లి కోర్టుకు హాజరైన కేటీఆర్