అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indian Stock Market | విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు వరుసగా 3వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉండడం, ముడిచమురు ధరలు దిగివస్తుండడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మెరుగుపడుతోంది. గ్లోబల్ మార్కెట్లనుంచి అందుతున్న సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల బాటలో సాగుతోంది.
Indian Stock Market | లాభాలతో ప్రారంభం..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) శుక్రవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 70 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా మొదట్లో 189 పాయింట్లు నష్టపోయింది. అక్కడినుంచి కోలుకుని 264 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 44£ పాయింట్ల లాభంతో ప్రారంభమై 62 పాయింట్లు పడిపోయింది. కనిష్టాల వద్ద లభించిన కొనుగోళ్ల మద్దతుతో కోలుకుని 82 పాయింట్లు పెరిగింది. మధ్యాహ్నం 12.10 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 130 పాయింట్ల లాభంతో 78,058 వద్ద, నిఫ్టీ 53 పాయింట్ల లాభంతో 24,370 వద్ద ఉన్నాయి.
Indian Stock Market | ఐటీ సెక్టార్‌లో లాభాల స్వీకరణ..
గత నాలుగు సెషన్లుగా లాభాలతో దూసుకువెళ్తున్న ఐటీ సెక్టార్.. శుక్రవారం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా వంటి స్టాక్స్ ప్రాఫిట్ బుకింగ్‌తో నష్టాల బాటలో ఉన్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 17 స్టాక్స్ లాభాలతో, 13 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్ 7.17 శాతం, బజాజ్ పిన్‌సర్వ్ 4.98 శాతం, ఎం అండ్ ఎం 4.67 శాతం, సన్‌ఫార్మా 1.08 శాతం, అదానీపోర్ట్స్ 0.75 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : టీసీఎస్ 2.16 శాతం, ఇన్ఫోసిస్ 1.65 శాతం, ఎటర్నల్ 1.43 శాతం, ఐటీసీ 1.28 శాతం, టెక్ మహీంద్రా 1.14 శాతం నష్టాలతో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: July 31 Market Analysis | గ్రీన్‌లో గ్లోబల్ మార్కెట్లు..గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ