అక్షరటుడే, వెబ్‌డెస్క్: July 31 Market Analysis | ఏఐ మౌలిక సదుపాయాలపై భారీ వ్యయం గురించి ఉన్న భయాలను తగ్గించేలా టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్(Microsoft) అంచనాలను ప్రకటించడంతో గత సెషన్‌లో చిప్ స్టాక్‌లు దూసుకెళ్లాయి.
వాల్‌స్ట్రీట్(Wallstreet ) తిరిగి లాభాల బాట పట్టగా.. యూరోప్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ లాభాలతో ట్రేడవుతుండడం దేశీయ ఈక్విటీ మార్కెట్లకు సానుకూల ప్రారంభాన్ని సూచిస్తోంది.
July 31 Market Analysis | యూఎస్ మార్కెట్లు..
గత సెషన్‌లో నాస్‌డాక్ 2.79 శాతం, ఎస్ అండ్ పీ 1.66 శాతం లాభపడ్డాయి. శTక్రవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.41 శాతం లాభంతో ఉంది.
July 31 Market Analysis | యూరోప్ మార్కెట్లు..
యూకేకు చెందిన ఎఫ్టీఎస్ ఈ 0.10 శాతం నష్టపోగా.. ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.91 శాతం, జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.59 శాతం పెరిగాయి.
July 31 Market Analysis | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 13.99 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 6.91 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 4.32 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.76 శాతం లాభంతో ఉండగా.. సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 1.12 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.18 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.38 శాతం నష్టంతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ డౌన్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు వరుసగా మూడవ సెషన్‌లోనూ తమ కొనుగోళ్ల పరంపరను కొనసాగించారు. ఇది భారత మార్కెట్లపై విశ్వాసం నిలకడగా ఉందని సూచిస్తోంది. గత సెషన్‌లో నికరంగా రూ. 3,623 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
- డీఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 1,864 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 3 పైసలు బలహీనపడి 95.68 వద్ద ఉంది.
- యూఎస్ డాలర్ ఇండెక్స్ 100.15 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.66 వద్ద ఉన్నాయి.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.18 నుంచి 1.26 కు పెరిగింది.
- విక్స్ 1.23 శాతం పెరిగి 12.15 వద్ద ఉంది.
- క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 85.67 డాలర్ల వద్ద ఉంది.