అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Indian Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లో పతనం కొనసాగుతోంది. జియో పొలిటికల్ టెన్షన్స్కుతోడు క్రూడ్ ఆయిల్ ధరలు గరిష్ట స్థాయిల వద్ద కొనసాగుతుండడం, విదేశీ సంస్థాగత మదుపరులు భారీగా పెట్టుబడులు ఉపసంహరిస్తుండడం భారత స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముడి చమురు ధరలతోపాటు పెరుగుతున్న యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ రూపాయిపై ఒత్తిడిని పెంచుతున్నాయి. ఆటో స్టాక్స్ ఒత్తిడికి గురవుతుండగా.. బ్యాంకింగ్ స్టాక్స్ రాణిస్తున్నాయి.
Indian Stock Market | నష్టాలతోనే ప్రారంభం..
దేశీయ మార్కెట్లు (Domestic Markets) గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 288 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో ఐదు పాయింట్లు కోల్పోయింది. అక్కడినుంచి కోలుకుని 385 పాయింట్లు ఎగబాకింది. నిఫ్టీ 77 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 35 పాయింట్లు తగ్గింది. కనిష్టాలవద్ద లభించిన కొనుగోళ్ల మద్దతుతో 102 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాల వద్ద అమ్మకాల ఒత్తిడితో ప్రధాన సూచీలు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 11.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 142 పాయింట్ల నష్టంతో 72,338 వద్ద, నిఫ్టీ 71 పాయింట్ల నష్టంతో 22,549 వద్ద ఉన్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 10 స్టాక్స్ లాభాలతో, 20 స్టాక్స్ నష్టాలతో సాగుతున్నాయి. కొటక్ బ్యాంక్ 1.64 శాతం, ఇన్ఫోసిస్ 1.51 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.28 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.96 శాతం, టీసీఎస్ 0.88 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : ఎం అండ్ ఎం 2.63 శాతం, మారుతి 2.39 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 2.37 శాతం, ఐటీసీ 1.97 శాతం, పవర్‌గ్రిడ్ 1.90 శాతం నష్టాలతో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: Oct 10 Market Analysis | లాభాల్లో ఆసియా మార్కెట్లు..నెగెటివ్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ